నిఫా ఎఫెక్ట్: కేరళ పండ్లు, కూరగాయలపై యూఏఈ నిషేధం
Recommended Video

నిఫా ఎఫెక్ట్ తో కేరళకు షాకిచ్చిన యూఏఈ
దుబాయ్/న్యూఢిల్లీ: 'నిఫా' వైరస్ కారణంగా కేరళ నుంచి తాజా కూరగాయలు, పండ్ల దిగుమతిని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్(యుఏఈ) మంగళవారం నిషేధించింది. యుఏఈ పర్యావరణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.
ఇదే విషయాన్ని అబూదాబీ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థతో పాటూ దుబాయ్, షార్జా, అజ్‌మన్, రస్‌అల్ ఖైమా, ఫ్యుజయిరా పురపాలక సంఘాలకు ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను పంపింది.

కేరళలో 'నిఫా' వైరస్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిఫా వైరస్ కారణంగా కేరళలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.












Click it and Unblock the Notifications