Nipah virus: కరోనా కంటే చాలా ప్రమాదకరమన్న ఐసీఎంఆర్, కేరళలో నిపా వైరస్ కలవరం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కంటే నిపా వైరస్ ప్రమాదకరమైనదని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) స్పష్టం చేసింది. కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. నిపా వైరస్ కారణంగా కేరళలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. అయితే, నిపా వైరస్ సోకిన వారు మరణించే అవకాశాలు చాలా ఎక్కువని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇది 40-70 శాతం మధ్య ఉంటుందని తెలిపింది.
అయితే, ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 సోకినవారు మరణించే అవకాశం 2-3 శాతం మాత్రమే ఉండేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భల్ తెలిపారు. కేరళలో ప్రస్తుతం ఒకే రోగి నుంచి ఈ వైరస్ వ్యాప్తి మొదలైందని చెప్పారు. స్థానికంగా నిపా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే, కేరళలోనే ఈ వైరస్ తరచూ ఎందుకు వెలుగుచూస్తుందనేది తెలియడం లేదన్నారు.

2018లో వ్యాప్తి చెందినప్పుడు గబ్బిలాలతో సంబంధం ఉన్నట్లు కనుగొన్నామని.. అయితే, గబ్బిలాల నుంచి మనుషులకు ఇన్‌ఫెక్షన్ ఎలా సంక్రమిస్తుందో ఖచ్చితంగా తెలియదని రాజీవ్ భల్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వైరస్ వ్యాప్తి వర్షాకాలంలోనే జరుగుతోందని చెప్పారు.
కేరళలో తాజాగా కొయ్‌కోడ్‌కు చెందిన 39ఏళ్ల వ్యక్తికి నిపా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుత కేసుతో ఈ వైరస్ సోకినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. యాక్టివ్ కేసులు నాలుగుకు చేరాయి. వైరస్ వ్యాప్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఇక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
కాగా, నిపా విషయంలో ఐసీఎంఆర్ వద్ద ప్రస్తుతానికి 10 మంది రోగులకు సరిపడా మాత్రమే మోనోక్లోనల్ యాంటీబాడీ డోసులు ఉన్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ తెలిపారు. 2018లో ఆస్ట్రేలియా నుంచి వాటిని తెప్పించామన్నారు. ఇప్పుడు మరో 20 డోసులు సేకరించనున్నామని తెలిపారు. ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలోనే ఈ మందు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎవరికీ ఈ యాంటీబాడీ డోసు ఇవ్వలేదని తెలిపారు.
ఇక భారత్ వెలుపల మాత్రం 14 మంది నిపా రోగులకు ఈ యాంటీబాడీలు అందించారని.. వారంతా కోలుకున్నారని ఆయన వివరించారు. అయితే, యాంటీబాడీ డోసు భద్రత విషయంలో కేవలం ఫేజ్-1 ట్రయల్ మాత్రమే పూర్తయిందని.. అది కూడా విదేశాల్లోనేని రాజీవ్ తెలిపారు. దాని సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించాల్సి ఉందన్నారు. కేరలలో ఈ యాంటీబాడీ డోసును ఉపయోగించే విషయంలో స్థానిక ప్రభుత్వంతోపాటు వైద్యులు, రోగుల కుటుంబీకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications