బ్యాంకు అధికారులకు డైమండ్ జ్యువెల్లరీలు లంచంగా ఇచ్చిన నీరవ్ మోడీ
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ముంచి విదేశాల్లో తలదాచుకుంటున్న నీరవ్ మోడీ పక్కా ప్లాన్‌తో అక్రమాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తనకు సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు బంగారం, బంగారు ఆభరణాలు లంచంగా ఇచ్చారని తెలిపారు.
మరోవైపు, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీలకు చెందిన ఆస్తులను విక్రయించకుండా 60కి పైగా వ్యక్తులు/ కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నిషేధం విధించింది. తమ విజ్ఞప్తి మేరకు ఈ నిషేధ ఉత్తర్వులు వెలువడినట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన కొందరి ఆస్తుల పైనా నిషేధం వర్తిస్తుంది. తిరిగి ప్రకటన వెలువడే వరకు ఈ ఆస్తులపై, కంపెనీలపై లావాదేవీలు జరగకుండా ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఎన్‌సీఎల్‌టీలో తదుపరి విచారణ ఈ నెల 26న జరగనుంది. దానికి సంబంధిత పక్షాలు హాజరుకాకపోతే వారి పరోక్షంలో తీర్పు వెలువరిస్తారు.












Click it and Unblock the Notifications