'నిర్భయ' జువైనల్ నిందితుడి రిలీజ్: అర్ధరాత్రి అనూహ్య పరిణామాలు
ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మూడేళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసులో పిన్న వయస్కుడైన దోషి ఆదివారం విడుదల అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో శనివారం రాత్రి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తమ కూతురిని అత్యాచారం చేసిన దోషిని విడుదల చేయవద్దంటూ నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ మహిళా కమిషన్ శనివారం హైకోర్టుకు అప్పీల్ చేశాయి. చట్ట ప్రకారం పిన్న వయస్కుడైన దోషి విడుదలను ఆపడం కుదరదని హైకోర్టు తెలిపింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్... దోషి విడుదలపై స్టే విధించాలని అర్ధరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విడుదలపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ అంశంపై తదుపరి విచారణ సోమవారం చేపడతామని ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో తెలిపింది.
పిన్న వయస్కుడైన దోషి విడుదల కష్టమని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి అన్నారు. విడుదల అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, సోమవారం కేసు విచారణకు రానుండటంతో దోషి విడుదల కాకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, నిర్భయ కేసులో జువైనల్ నిందితుడి విడుదలను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.












Click it and Unblock the Notifications