వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ వర్గంలో గంగిరెద్దులకే స్థానం! పన్నీర్ కు జై, స్టార్ వ్యాఖ్యాత

అమ్మ జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ. దినకరన్ కు స్థానిక ఓటర్లు తగిన బుద్ది చెబుతారని, శశికళ వర్గంలో వారు చెప్పినట్లు విని అక్కడి నుంచి తలఊపుకుని.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో శశికళ వర్గం తీరుపై ఆ పార్టీ స్టార్ వ్యాఖ్యాతల్లో అగ్రహాన్ని రేకెత్తిస్తున్నట్లు సమాచారం. శశికళ వర్గంలో ఉన్న యాంకర్, నటి, స్టార్ వ్యాఖ్యాత నిర్మలా పెరియసామి మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకుని ఆయన వర్గంలో చేరిపోయారు.

ఈ సందర్బంగా నిర్మలా పెరియసామి మీడియాతో మాట్లాడుతూ టీటీవీ. దినకరన్, మాజీ మంత్రి వలర్మతి తదితరుల తీరుపై మండిపడ్డారు. అమ్మ జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ. దినకరన్ కు స్థానిక ఓటర్లు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Nirmala Periyasamy has joined Team OPS and has blasted Sasikala group for their arrogance and atrocities.

అమ్మ వారసులు అని చెప్పుకుని ఆర్ కే నగర్ నుంచి పోటీ చేస్తున్న దినకరన్ కు పార్టీ బాధ్యతలు నిర్వహించే అర్హతలేదని, ప్రస్తుతం శశికళ వర్గం అంతా ఓ మాఫియాలాగా తయారైయ్యిందని నిర్మలా పెరియసామి విరుచుకుపడ్డారు.

నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు దినకరన్, శశికళ వర్గం నడుచుకోవడం లేదని, అతా వారు చెప్పినట్లు విని అక్కడి నుంచి తలఊపుకుని గంగిరెద్దుల్లాగా ఉండే వారికే అక్కడ స్థానం ఉంటుందని విమర్శించారు.

జయలలిత ఎంతగానో నమ్మి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి అప్పగించిన పన్నీర్ సెల్వం నిజమైన అమ్మ వారసుడు, ఆయనకు మా మద్దతు ఉంటుందని నిర్మలా పెరియసామి అన్నారు. నిర్మలా పెరియసామి బాటలోనే పలువురు వ్యాఖ్యాతలు పన్నీర్ సెల్వం వర్గంలో చేరే అవకాశం ఉందని సమాచారం.

English summary
Nirmala Periyasamy has joined Team OPS and has blasted Sasikala group for their arrogance and atrocities. She met former CM OPS at his house yesterday night and extended her support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X