ఒత్తిడి అధిగమించడంపై నిర్మలమ్మ కామెంట్స్ : అసలు ఉద్దేశమేంటి..!!
ఈ మధ్యనే విద్యాసంస్థల్లో ఒత్తిడిని ఎలా జయించాలో అనే అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. వాస్తవానికి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయి.విద్యార్థుల సంక్షేమంను దృష్టిలో ఉంచుకుని, మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆమె చెప్పారు. అయితే ఇక్కడ ఏ ఒక్కరినో లేదా సంస్థనో అన్నట్లుగా ఆపాదించాల్సిన అవసరం లేదు. ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలనే అంశంపై మాట్లాడిన నిర్మలా సీతారామన్.. మానసిక ఒత్తిడిని ప్రతి ఒక్క విద్యార్థి, లేదా అప్పుడే ఉద్యోగంలో చేరిన యువత ఎదుర్కునే సమస్య అని చెప్పుకొచ్చారు. అయితే అలాంటి మానసిక ఒత్తిడిని విద్యార్థులకు దూరం చేయాలన్న మంచి ఉద్దేశంతో ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందుకు తీసుకోవాల్సిన చర్యలు, తద్వారా భవిష్యత్తులో విషాదాలను నివారించడమే ప్రభుత్వం లక్ష్యంగా నిర్మలమ్మ వివరించారు.
ఎర్న్‌స్ట్ & యంగ్ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి జీవితం విషాదంతో ముగిసింది అని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికి కారణం ఒత్తిడికి గురవడమే అని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇటు విద్యా వ్యవస్థలో అటు వృత్తి వ్యవస్థలో ఒత్తిడిని అధిగమించేందుకు సమూల మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు విమర్శలు గుప్పించారు. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు. సీఏ లాంటి ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ రాయాల్సిన సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పిన ఆర్థికశాఖ మంత్రి, ఉద్యోగం చేసే చోట కూడా ఇదే రకమైన ఒత్తిడి ఉంటుందని అన్నారు.

ఒత్తిడి సమస్యను అధిగమించేందుకు విద్యాసంస్థల్లో ధ్యానమందిరాలు, ప్రార్థన ఆలయాలు ఉంటే విద్యార్థికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.ఇలా చేయడం వల్ల విద్యార్థికి బాగా చదవడమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుందని వెల్లడించారు.నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయన్న విషయం తెలియగానే వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. విద్యాసంస్థలను ప్రోత్సహించడం, యువ ఉద్యోగస్థులకు అండగా నిలవడం తన ప్రధాన లక్ష్యంగా చెప్పుకొచ్చారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుబట్టాల్సిన పని లేదు:
మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని అధిగమించడం పైనే నిర్మలా సీతారామన్ దృష్టి సారించారు.మానసికంగా ఎన్నో కష్టాలు పడుతున్న అన్నా సెబాస్టియన్ లాంటి వారిని కించపరిచే ఉద్దేశం తనది కానే కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను వక్రీకరించడం వల్ల అది వివాదానికి దారితీసింది. ఈ చర్చ ఒత్తిడికి గురవుతున్న యువత కుటుంబాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ఒక మహిళగా, నేతగా ఒత్తిడిని అర్థం చేసుకోగలను:
భారత్‌లో ఉన్న మహిళా రాజకీయనాయకుల్లో నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె పోషిస్తున్న పాత్రలో ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు అదే సమయంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వయంగా తానే ఒక మహిళగా ఎంతో ఒత్తిడికి గురవుతూ మరో మహిళ గురించి తప్పుగా మాట్లాడరనేది చాలా మంది అభిప్రాయంగా ఉంది. ఒత్తిడిని ఎలా అధిగమించాలో అనే అంశంపై మాత్రమే ఆమె వ్యాఖ్యానించారు తప్పితే ఒక వ్యక్తిని విమర్శించేందుకు కాదు.
నష్టం గురించి ఆలోచన చేయండి, వివాదం పై కాదు:
అన్నా సెబాస్టియన్ ఒత్తిడిని తట్టుకోలేక ఏ రకంగా తన జీవితానికి ముగింపు పలికిందో దానిపై ఆలోచన చేయాల్సిన సమయం ఇది.కానీ సీతారామన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, సెన్సేషన్ కోసం ఏదో చేయాలని చూస్తే అది నష్టమే చేకూరుస్తుంది తప్పితే, ఒత్తిడిని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్న ప్రణాళిక లేదా సంస్కరణల అమలులో జాప్యం జరిగే అవకాశం ఉంది.

మానసిక ఆరోగ్యం పై నిర్మాణాత్మక చర్చ
ఒత్తిడిని అధిగమించేందుకు విద్య వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలన్న సీతారామన్ ప్రతిపాదన చాలా నిర్మాణాత్మకమైనది.అంతేకాదు ఈ ఆలోచన ఆమె ముందు చూపుకు అద్దం పడుతుంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేయడం వల్ల వచ్చే లాభం ఏమి లేకపోగా, ఒత్తిడిని అధిగమించేందుకు రచించిన కార్యాచరణ డైవర్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇటు విద్యార్థులు అటు యువ ఉద్యోగస్థులు ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేదానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇక చివరిగా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మంచి ఉద్దేశంతో కూడినవి. అయితే కొందరు దాన్ని వివాదాస్పద అంశంగా చిత్రీకరించారు.అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న భారత్‌లో విద్యార్థులు, యువ ఉద్యోగస్థులు ఒత్తిడిని అధిగమించి సమతుల్యమైన జీవనశైలి కలిగి ఉండాలనేదే నిర్మలమ్మ ఆశ. ఆమె ప్రతిపాదించిన అంశాలు అంటే నివారణ,మద్దతు, వ్యవస్థలో మార్పులు చాలా గొప్పవి.ఈ ఆలోచన పై నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి అదే సమయంలో సంస్కరణల అమలులో కీలకంగ మారాలి.












Click it and Unblock the Notifications