Nirmala sitharaman saree: తమిళనాడు చీరలో మెరిసిన నిర్మలమ్మ... బడ్జెట్ చీర స్పెషాలిటీ ఇదే!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేడు తొమ్మిదవ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమర్పణకు ప్రతి సంవత్సరం నిర్మల సీతారామన్ ధరించే చీర అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దేశ చరిత్రలోనే తొలిసారి ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ను సమర్పిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తమిళనాడుకు చెందిన కాంచీపురం పట్టు చీరలో మెరిశారు.
తమిళనాడు చీరలో మెరిసిన నిర్మలా సీతారామన్
ఊదా రంగులో ఉన్న చీరకు, లేత బంగారు గోధుమ రంగు చెక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో తమిళనాడుకు చెందిన చీరను ఆమెను ధరించడం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఈ సంవత్సరం తమిళనాడుకు చెందిన చీరను ధరించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

2019 నుండి నిర్మలమ్మ బడ్జెట్ చీరల విశేషాలు
ఈసారి ఆదివారం బడ్జెట్ చారిత్రక సందర్భం కాగా, కాంచీపురం చీర ఎంపిక ఈ బడ్జెట్ ను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ప్రతి సంవత్సరం నిర్మల సీతారామన్ కట్టుకునే చీరకు ఒక విశేషం ఉంటుంది. 2019వ సంవత్సరం నుంచి తీసుకున్నట్లయితే 2019లో నిర్మల సీతారామన్ గ్రీన్ కలర్ మంగళగిరిచీరలో బడ్జెట్ సమర్పించారు. గులాబీ అంచుతో ఉన్న సరళమైన ఖాదీ లుక్ తో ఉన్న చీర చాలా సాధారణమైన, సాంప్రదాయమైన ప్రత్యేకగుర్తింపుని తెచ్చిపెట్టింది.
హస్తకళలకు మద్దతుగా, ఆర్ధిక వ్యవస్థకు ప్రతీకగా చీరలు
2020 సంవత్సరంలో రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా పసుపు రంగు మంగళగిరి చీర, ఆకుపచ్చ కలర్ అంచు తో నిర్మల సీతారామన్ ధరించారు. 2021లో ఎరుపు రంగు అంచుతో ఆఫ్ వైట్ బొమ్కాయ్ చీరతో నిర్మల సీతారామన్ బడ్జెట్ సమర్పించారు. ఈ చీర భారతీయ హస్త కళలకు మద్దతుగా నిలిచిన ఎంపిక కాగా ఇది ఒడిశా రాష్ట్రానికి చెందినది.
అనేక భావనలను ప్రతిబింబించేలా చీరల ఎంపిక
2022లో కాఫీ బ్రౌన్ టౌన్ లో కర్ణాటకకు చెందిన ఇల్కల్ చీర, ఓపెన్ ఫర్ లోకల్ భావనకు ప్రతీకగా నిలిచింది. 2023 లో నీలం రంగు కంఠా వర్క్ చీరను నిర్మల సీతారామన్ ధరించారు, మహిళా నేతృత్వానికి, స్వయం ఉపాధికి సంకేతంగా ఈ చీర నిలిచింది. 2024లో ఆకుపచ్చ పసుపు మిశ్రమంలో ఉన్న చీర పర్యావరణహిత అభివృద్ధికి ప్రతీకగా కనిపించింది.
#WATCH | Delhi | Union Finance Minister Nirmala Sitharaman is set to present her ninth consecutive Union Budget today pic.twitter.com/GqjyTDhYp1
— ANI (@ANI) February 1, 2026
గత బడ్జెట్ సిల్క్ చీరతో, ఈ బడ్జెట్ కాంచీవరం పట్టు చీరతో
2025 లో భారతీయ సంప్రదాయ విలువలను ప్రతిబింబించేలా గాఢమైన రంగుల సాంప్రదాయ సిల్క్ చీరను నిర్మల సీతారామన్ కట్టుకున్నారు. ఇక 2026 బడ్జెట్ సమర్పణకు తమిళనాడు కాంచీపురం పట్టు చీరలు కట్టుకొని ప్రత్యేకంగా నిలిచారు నిర్మల సీతారామన్.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications