వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: భారత్‌పై నిస్సాన్ రూ.5వేల కోట్ల దావా, అలా కోరినా అల్టిమేటం, మోడీకి నోటీసులు, అసలేం జరిగింది?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: నిస్సాన్ మోటార్స్ భారత్ దేశంపై రూ.5 వేల కోట్లకు దావా వేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ జపాన్‌కు చెందిన ఈ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ భారత్‌పై పెద్ద మొత్తానికి దావా వేసింది.

ఇందుకు సంబంధించి గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీకి లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి తెలిపినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను నిస్సాన్‌ కోరింది.

ఏం జరిగిందంటే

ఏం జరిగిందంటే

2008లో ఆ సంస్థ తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆ సమయంలో పన్ను రీఫండ్‌తో పాటు పలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు నిస్సాన్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. అయితే నాటి నుంచి తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదని నిస్సాన్‌ చెబుతోంది.

కేంద్రం దృష్టికి

కేంద్రం దృష్టికి

బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తాము ఈ విషయాన్ని 2015లో కేంద్రం దృష్టికి తీసు వెకెళ్లామని చెప్పింది.
దీనిపై నిస్సాన్‌ ఛైర్మన్‌ కార్లోస్‌ గోస్న్‌ గతేడాది మార్చిలో ప్రధాని మోడీకి స్వయంగా లేఖ రాశారని, బకాయిలు చెల్లించేలా చూడాలని కోరినట్లు సంస్థ తెలిపింది.

ప్రధాని మోడీకి నోటీసులని

ప్రధాని మోడీకి నోటీసులని

అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, తాము ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించినట్లు పేర్కొంది. దీంతో గతేడాది జులైలో ప్రధాని మోడీకి లీగల్‌ నోటీసులు జారీ అయ్యాయని చెబుతున్నారు. అయితే బకాయిలు తప్పకుండా చెల్లిస్తామని దీన్ని లీగల్‌ కేసు చేయొద్దని కేంద్రం కోరినట్లుగా చెబుతున్నారు.

నిస్సాన్ మాత్రం

నిస్సాన్ మాత్రం

నిస్సాన్‌ మాత్రం అందుకు అంగీకరించకుండా ఈ వ్యవహారంలో మద్యవర్తిని నియమించుకోవాలని భారత్‌కు ఆల్టిమేటం జారీ చేసిందని అంటున్నారు. డిసెంబర్‌ రెండో వారంలో దీనికి సంబంధించిన విచారణ జరగనుంది. మరోవైపు తమిళనాడు సీనియర్‌ అధికారులు కూడా దీనిపై స్పందించారు. బకాయిల విషయంలో కంపెనీల మధ్య ఎలాంటి వివక్ష చూపించడం లేదని, త్వరలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

English summary
Japanese carmaker Nissan has begun international arbitration against India to seek more than $770m (£569m) in a dispute over unpaid state incentives, according to a person familiar with the matter and documents reviewed by Reuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X