నిఠారీ హత్యల తీర్పు-నిందితులకు హైకోర్టు విముక్తితో రేప్, హత్య, నరమాంస భక్షణ అన్నీ గాలికి..

2005-2006లో ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో వరుస హత్యలు చోటు చేసుకున్నాయి. 2006 నిఠారీ హత్యల కేసుగా దీన్ని పిలుస్తారు. ఈ వరుస హత్యలకు కారకులైన ఇద్దరు హంతకులు మోనీందర్ సింగ్ పంధేర్‌, సురేంద్ర కోలీని అలహాబాద్ హైకోర్టు ఆధారాలు లేవనే కారణంతో నిర్దోషులుగా నిర్ణయిస్తూ నిన్న సంచలన తీర్పు ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో ఈ కేసులో అత్యాచారం, హత్య, నరమాంస భక్షణ, ఆధారాల ధ్వంసం వంటి అభియోగాలన్నీ తేలిపోయాయి.

అసలేం జరిగింది ?
2006 డిసెంబరు 29న నోయిడాలోని నిఠారీ ప్రాంతంలో ఓ కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కాలువలను మరింత తవ్వగా.. మరిన్ని అస్థిపంజరాల అవశేషాలు దొరికాయి. ఇవన్నీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన పేద పిల్లలు, యువతుల అవశేషాలుగా తేలింది.10 రోజుల్లో ఈ కేసు సీబీఐకి అప్పగించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. మరిన్ని ఎముకలు స్వాధీనం చేసుకుంది.
అలాగే ఈ పిల్లల్ని, యువతుల్ని అత్యాచారం, హత్య చేసి, నరమాంస భక్షణ చేసినట్లు తేలింది.

Nithari killings: moninder pandher,surendra kolis acquittal ends rape, murder, other allegations

నోయిడాలో నివాసం ఉంటున్న మోనిందర్ సింగ్, అతని వద్ద ఉండే సురేంద్ర కోలీల్ని నిందితులుగా సీబీఐ తేల్చింది. వీరిని అరెస్టు చేసి పంధేర్ ను నోయిడా జైలుకు, కోలీని ఘజియాబాద్ జైలుకు పంపింది. విచారణలో సురేంద్ర కోలీ ఆరుగురు పిల్లలను, పాయల్ అనే 20 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించిన తర్వాత చంపినట్లు ఒప్పుకున్నాడు. అలాగే వీరిని చైల్డ్ పోర్న్ వీడియోలు కూడా తీసినట్లు తేలింది. చివరికి పంథేర్ ఇలా వీడియోలు తీసిన వారిలో అతని మనవరాళ్లు కూడా ఉండటంతో సీబీఐ నిర్ఘాంతపోయింది.

నిఠారీ హత్యలకు అవయవ వ్యాపారం, నరమాంస భక్షణే ఈ హత్యల వెనుక ఉద్దేశ్యంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు, నార్కో విశ్లేషణ తర్వాత కోలీ తన యజమాని పంధర్‌కు క్లీన్ చిట్ ఇచ్చాడు. బాధితులందరినీ గొంతు నులిమి చంపేసినట్లు వెల్లడించాడు. మృతదేహాలను తన వ్యక్తిగత వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి ముక్కలు చేసే ముందు వారిపై అత్యాచారం చేసేవాడని చెప్పాడు. చివరికి 2009 ఫిబ్రవరి 13న బాధితుల్లో ఒకరైన 14 ఏళ్ల రింపా హల్దార్‌పై అత్యాచారం, హత్య చేసినందుకు కోలీ, పంధేర్‌లకు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది.

అయితే 2014లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరిద్దరి క్షమాభిక్ష పిటిషన్లు తోసిపుచ్చారు. అదే ఏడాది సుప్రీంకోర్టు వీరి ఉరిశిక్షను నిలిపివేసింది.అనంతరం నిందితుల్లో ఒకరైన సురేంద్ర కోలీ మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు యావజ్జీవంగా మార్చింది. ఆ తర్వాత మరో కేసులో సీబీఐ ప్రత్యేకోర్టు వీరిద్దరికీ మరణశిక్ష విధించింది. కోలీ దోషిగా తేలిన కేసుల్లో ఇది తొమ్మిదవది. పంధేర్, కోలీ ఇద్దరినీ కోర్టు దోషులుగా నిర్ధారించిన మూడో కేసు కూడా. 2022లో మరో కేసులో కోలీకి సీబీఐ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో సింగ్ పంధేర్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానాలు విధించింది.

హత్య, అత్యాచారం, కుట్ర మరియు నేర రుజువును నాశనం చేయడం వంటి నేరాలకు కోలీ దోషిగా తేలగా, పంధేర్ అనైతిక అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలాడు. గతంలో 10కి పైగా కేసుల్లో కోలీకి మరణశిక్ష పడింది. పందేర్‌కు కూడా మూడు కేసుల్లో మరణశిక్ష పడింది. చివరికి అలహాబాద్ హైకోర్టు తాజాగా వీరిపై ఆధారాలు లేవంటూ విడుదలకు ఆదేశించడం తీవ్ర సంచలనం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+