రాక్షసుడు: 16మంది చిన్నారులపై రేప్, హత్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాపం పుణ్యం తెలియని 16మంది బాలికలను అత్యాచారం చేసి, ఆపై హత్యలు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

డీఎస్పీ విక్రమ్‌జీత్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రవీంద్రకుమార్‌(24)అనే వ్యక్తి 2009 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 మంది (మూడు నెలల నుంచి నాలుగేళ్ల వయస్సు) బాలికలను అత్యాచారం చేసి హత్య చేశాడు.

హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో చిన్నారులకు చాక్లెట్లు ఇప్పిస్తానని.. ఎవరులేని ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిపై అఘాయిత్యాలకు పాల్పడి చంపేసినట్లు తెలిపారు. జులై 14న బేగంపురాలో ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది.

Nithari rerun: Man sexually assaulted, killed at least 16 children

అనంతరం ఇంటికి సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో బాలికపై అత్యాచారం జరిగాక చంపబడిందని తేలింది. సంఘటన స్థలంలో దొరికిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా రవీంద్రను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

శుక్రవారం నిందితుడు రవీంద్రకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులకు.. అతడ్ని విచారించగా అతను చేసిన ఘోరాలు బయటపడ్డాయి. నిరుడి ఓ బాలుడిపై అత్యాచారానికి ప్రయత్నించి దొరికిపోయిన నిందితుడు, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు కెళ్ళినా మారని నిందితుడు ఈ ఘోరాలకు పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+