వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు విరుగుడు కనిపెట్టాడోచ్.. 28 రోజుల్లో మహమ్మారి అంతం.. సైంటిస్టులకు షాకిస్తూ..

|
Google Oneindia TeluguNews

''వాళ్లెవరో సైంటిస్టులట.. కోట్లాది డాలర్లు ఖర్చుచేసి కరోనాకు వ్యాక్సిన్ కనిపెడుతున్నారట.. అది కూడా ఇప్పుడు ట్రయల్స్ నిర్వహిస్తే.. 18 నెలల తర్వాత తుది ఫలితాలు వస్తాయట.. ఆలోగా మనందరం పుటుక్కుమంటే?.. అందుకే నేను చెప్పేది శ్రద్ధగ్గా వినండి.. బేసిగ్గా సనాతన భారతీయులెవరికీ కరోనా సోకే ఛాన్సే లేదు.. కానీ ఇది కలికాలం.. కాబట్టే ప్రమాదాల పట్ల జాగ్రత్త చాలా అవసరం.. ఇక నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం..

పచ్చయిపత్తిని వ్రతం..

పచ్చయిపత్తిని వ్రతం..

సాధారణంగా శీతాకాలం నుంచి ఎండాకాలంలోకి ప్రవేశించే సమయంలో.. సౌత్ ఇండియాలోని అన్ని గ్రామాలు విధిగా ఒక వ్రతాన్ని ఆచరిస్తాయి.. దాని పేరు ‘‘పచ్చయిపత్తిని''వ్రతం. సాక్ష్యాత్తూ పరాశక్తే ఉపవాసం ఉండే విధానమిది. కాబట్టి సామాన్యులందరూ విధిగా దీన్ని ఫాలో అవుతారు. ఇవాళ కరోనా నిరోధానికి డాక్టర్లు, సైంటిస్టులు ఏవైతే విధానాలు చెబుతున్నారో.. అవన్నీ ఈ వ్రతంలోనే ఉన్నాయి.. మొత్తంగా 28 రోజుల వ్యవధిలో కరోనాను ప్రపంచం నుంచి తరమేయగల ఆ వ్రతాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి.. విధానం చాలా సింపుల్..

మజ్జిగ, పానకం, వేపాకులు..

మజ్జిగ, పానకం, వేపాకులు..

తిండి పూర్తిగా మానేయండి.. అన్నం, కూరలు, కాయలు, పండ్ల జోలికి పోనేపోవద్దు.. కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా చిక్కటి మజ్జిగ, షడ్రుచుల పానకం. ఈ రెండు ద్రావకాలను క్రమం తప్పకుండా తాగుతూ.. పసుపు నీళ్లతో వీలైనన్ని ఎక్కువ సార్లు స్నానం చేస్తూఉండాలి. అంతేకాదు.. ఇంటి గుమ్మానికి, మంచంపైన వేపాకు దండలు ఉంచుకోవాలి.. అన్నిటికంటే ముఖ్యమైన మరో రెండు అంశాలేవంటే..

ఆ రెండూ తప్పవు..

ఆ రెండూ తప్పవు..

కనీసం 11కు తగ్గకుండా నిమ్మకాయలను సన్నటి తీగ ద్వారా మన ఒంట్లో అక్కడక్కడా గుచ్చుకోవాలి.. అలా నిమ్మకాయలు గుచ్చుకుని ఇంట్లో కూర్చుంటే సరిపోదు.. కరోనా మహమ్మారిని ఈ ప్రపంచం నుంచి తరిమేయాలంటే మనం ఇంకో అంకాన్ని కూడా దాటాల్సి ఉంటుంది.. అదే.. 11 అడుగుల అగ్నిగుండం. ద్రావకాలు మాత్రమే తాగుతూ, నిమ్మకాయలు శరీరానికి గుచ్చుకుని.. అగ్ని గుండాన్ని అటూ ఇటూ దాటాలి.. అలా 28 రోజులు కఠిన దీక్ష చేస్తే.. కరోనా వైరస్ మాయమైపోతుంది. నాదీ గ్యారంటీ'' అంటూ తన లక్షలాది మంది భక్తులకు ఉపదేశం చేశారు భగవాన్ నిత్యానంద స్వామీజీ.

వీళ్ల పని పట్టేదెవరు?

వీళ్ల పని పట్టేదెవరు?

ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ వివాదాస్పద మతగురువు.. చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించిన వ్యవహారాలు ఈ మధ్యే వెలుగులోకి వచ్చాయి. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టానంటూ ప్రకటించుకున్నాడీయన. సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు పెట్టిమరీ కరోనా నిరోధ వ్రతం గురించి ఉపదేశాలు దంచుతున్నాడు. కరోనా గురించి తప్పుడు పోస్టులు పెట్టిన కారణంగా ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ గురువులుగా గౌరవం పొందుతూ భక్తుల మెదళ్లలో తప్పుడు ఆలోచనలు నాటే స్వామీజీలు, బాబాజీల పని పట్టేది ఎవరు?

Recommended Video

CoronaVirus Latest Updates | Helpline Number | Symptoms & Precautions
భయమే పెట్టుబడి..

భయమే పెట్టుబడి..


భూగోళాన్ని వణికిస్తోన్న కొవిడ్-19(కరోనా వైరస్) ఇప్పటికే సుమారు 8వేల మందిని బలితీసుకుంది. వైరస్ వ్యాప్తి చెందుతోన్న వేగాన్ని బట్టి కొద్ది రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే పెరిగే అవకాశాలున్నాయి. ఈ మహమ్మారి నివారించేందుకు సైంటిస్టులు రేయింబవళ్లూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అమలాపురం నుంచి అమెరికా దాకా డాక్టర్లు వివిధ రకాలుగా వ్యాధికి విరుగుడు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కట్టడి ఉత్తర్వులు జారీకావడంతో మెజార్టీ ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. సరిగ్గా ఇదే అదనుగా మాయగాళ్లు మళ్లీ విజృంభిస్తున్నారు.. వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
Controversial godman Swami Nithyananda announced a "28-day spiritual regimen" to "heal the world" of the effects of novel coronavirus (COVID-19).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X