వీటికి సమాధానం చెప్పు కేసీఆర్, ఆరోపణలపై నీతి ఆయోగ్ రియాక్ట్
కేంద్రం కేటాయింపులు, నీతి ఆయోగ్ గురించి సీఎం కేసీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నిధుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. దీనిపై నీతి ఆయోగ్ స్పందించింది. రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదనే కేసీఆర్ కామెంట్లప నీతి ఆయోగ్ వేగంగా స్పందించింది. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ భేటీకి హాజరుకాకూడదని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం అని వెల్లడించింది.
అజెండా రూపకల్పనలో రాష్ట్రాలను పక్కనపెట్టారనే కేసీఆర్ ఆరోపణలు అర్ధరహితం అని అభివర్ణించింది. గత ఏడాదిలో సీఎంలతో 30 సమావేశాలు నిర్వహించామని తెలిపింది. సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కోసం ఈ సంస్థ ఏర్పాటయ్యిందని నీతి ఆయోగ్ తెలిపింది. అజెండా తయారీలో రాష్ట్రాలను సంప్రదించడం లేదనే మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
Recommended Video


నీతి ఆయోగ్ పనితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపణలు సరికాదని తెలిపింది. రాష్ట్రాలకు కేంద్రం అన్నిరకాలుగా ఆర్థిక సహకారం అందిస్తోందని కూడా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కేటాయింపులు 2015-16లో రూ.2,03,740 కోట్లు ఉండగా.. 2022-23 ఏడాదికి రూ.4,42,781 కోట్లకు పెరిగినట్టు తెలిపింది.
జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.3,982 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.200 కోట్లు మాత్రమే తీసుకుందని తెలిపింది. పీఎంకేఎస్‌వై- ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుదల చేశామని నీతి ఆయోగ్ వెల్లడించింది. మరీ దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని కోరింది. ఊరికే విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications