• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఫైన్ వేయరా అని నెటిజన్ల ప్రశ్నలు

|

న్యూఢిల్లీ : కొత్త మోటారు వాహన చట్టం పేరుతో వాహనదారుల నడ్డి విరుస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. చలానా పేరుతో వేలకు వేలు ఫీజు ముక్కుపిండి మరీ వసూల్ చేస్తున్నారు. టూవీలర్, కారు, ట్రాక్టర్, ఆటో .. దేనిని వదలడం లేదు. అయితే ప్రస్తుత రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నెటిజన్లకు దొరికిపోయారు. ఐదేళ్ల క్రితం హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన ఫోటోను షేర్ చేసి ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులరా .. ఈ ఫోటో చూడంటి అంటూ ట్వీట్లు చేస్తున్నారు కొత్త మోటారు వాహన చట్టం సామాన్యులకేనా ..? ప్రభుత్వ పెద్దలకు వర్తించదా అని నిలదీస్తున్నారు.

వామ్మో జరిమానాల మోత.. ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేల ఫైన్.. ఎక్కడో తెలుసా..?

సామాన్యులకో రూల్ ..

మోటారు వాహన చట్టం పేరుతో హెల్మెట్, రిజిస్ట్రేషన్ లేదని ఢిల్లీలో దినేశ్ అనే టూవీలర్ రైడర్‌కు రూ. 23 వేల ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. మరి కేంద్ర మంత్రి గడ్కరీ సంగతి ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 2014లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలో పర్యటించారు. ఆ సందర్భంలో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపారు. ఆ ఫోటోను ఓ నెటిజన్ తీసుకొని .. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నిస్తూ .. కొత్త మోటారు వాహన చట్టం కేవలం సామాన్యుకేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, కేంద్రమంత్రులకు వర్తించదా అని నిలదీశారు. మహారాష్ట్ర పోలీసులు ఈ నెల 3న #ThingsWeShouldCancel పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. దీనిని ట్యాగ్ చేస్తూ .. నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా నడిపిన ఫోటోను యాడ్ చేశారు. ఇదేంటి అని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకో రూల్ .. పెద్దలకో రూల్ అంటూ కొశ్చన్ చేస్తున్నారు. గడ్కరీ ఫోటో 2014లో నాగ్‌పూర్‌లో తీసినది. అప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసేందుకు గడ్కరీ .. స్కూటర్‌పై హెల్మెట్ లేకుండా వెళ్లారు.

ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేలు

ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేలు

గురుగ్రామ్‌లో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిబంధనలకు అతిక్రమించాడు. దానికి సంబంధించి న్యూ కాలనీలో ట్రాక్టర్‌ రూల్స్ అతిక్రమణను పోలీసులు చూశారు. అయితే అతను వెళ్తుంటే పట్టుకోవడం వేరు .. సీసీటీవీ ఫుటేజీలో చూసి మరీ జరిమానా వేశారు. అతనికి వేసిన జరిమానా చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయిపోయింది. రూ.59 వేల ఫైన్ విధించారు. ఇందుకు కారణాలు కూడా తెలిపారు. ఆ డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే ట్రాక్టర్ తిప్పుతున్నారని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా బయటకు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. దీంతోపాటు ఎయిర్ పొల్యూషన్ టెస్ట్ చేయించలేదని, అందులో హనికర పదార్థాలు తీసుకెళ్తున్నారని చెప్పారు. భయంకరమైన డ్రైవింగ్ చేస్తున్నారని .. పోలీసు ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిబంధనలను పాటించడం లేదని .. దీంతోపాటు చివరగా ట్రాక్టర్ లైట్ పసుపుపచ్చగా ఉందని పేర్కొంటూ రూ.59 వేల జరిమానా విధించారు. కొత్త మోటారు వాహన చట్టం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఆటో డ్రైవర్‌కు రూ.32.500

ఆటో డ్రైవర్‌కు రూ.32.500

ఇదే కాదు నిన్న ఆటో రిక్షా యజమానికి ఫైన్ వేశారు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముస్తాకిల్ పొట్ట కూటి కోసం ఢిల్లీ వచ్చారు. గత 15 ఏళ్ల నుంచి గురుగ్రామ్‌లో ఉంటున్నారు. నిన్న సికందర్‌పూర్ వద్ద గల సెక్టార్ 26 రహదారిపై రెడ్‌లైట్ పడింది. రెడ్ లైట్ పడిన ఆటో రిక్షాను యధేచ్చగా వెళ్లాడు. దీంతో నిబంధనలను అతిక్రమించారని భావించి ఫైన్ వేశారు. ఆటోను నిలిపి .. పేపర్లు చూపించాలని కోరారు. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడం చూసి ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. ఆటో రిక్షాకు సంబంధించిన డాక్యుమెంట్లను డీఎల్ఎఫ్ ఫేజ్-3 వద్ద వదిలేశానని అతని చెప్పారు. తనకు 10 నిమిషాల సమయం ఇస్తే ఆర్సీ, సీ బుక్ తీసుకొస్తానని చెప్పారు. వారిని అర్థించిన ప్రయోజనం లేకపోయింది. ఆటో యజమాని మాటను ట్రాఫిక్ పోలీసులు లెక్కచేయలేదు.

English summary
Dinesh Madan, a resident of Delhi, was recently fined a challan worth Rs 23,000 by Gurugram Police for flouting several rules. His violations? Driving without a license, driving without a registration certificate, driving without a helmet, among others. If you do not know it already, the Ministry of Law and Justice under the Government of India has recently passed new Motor Vehicles (Amendment) Bill, 2019. The user didn't stop at that and went ahead by starting an online petition for others to join in and to have Nitin Gadkari "penalised" for not wearing a helmet while riding the scooter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more