ఆలస్యం వద్దు: మోడీతో నితీశ్ కుమార్
న్యూఢిల్లీ: కేంద్రంలోప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే పక్షాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ పక్ష నేతలు ప్రధాని నరేంద్రమోడీ నివాసం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీయేలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి.
టీడీపీ, జేడీఎస్, ఆర్ఎల్డీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జనసేన, హిందూస్తానీ ఆవామీమోర్చా, అప్నాదళ్, అస్సాం గణపరిషత్, శివసేన(షిండే), అజిత్ పవార్(ఎన్సీపీ), జేడీయూ వంటి పార్టీలు ఉన్నాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్డీయే సమావేశం తాజాగా ముగిసింది.

ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఎన్డీయే నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నట్లు తెలుస్తోంది. నేడే నరేంద్రమోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కలిసి రాష్ట్రపతిని కలువనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారని తెలిసింది.
ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలిసిన మోడీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని ఆమె కోరారు. జూన్ 8న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
#WATCH | NDA leaders held a meeting today at 7, LKM, the residence of Prime Minister Narendra Modi, in Delhi pic.twitter.com/xuxjDjYKaI
— ANI (@ANI) June 5, 2024
మోడీకి నితీష్ కీలక సూచన
కాగా, ప్రభుత్వం ఏర్పాటులో ఆలస్యం చేయొద్దని నరేంద్ర మోడీకి జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ సూచించారు. వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా, ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రాగా, ఇండి కూటమికి 233 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని పలు పార్టీలకు ఇండి కూటమి నేతలు ఆహ్వానాుల పంపుతున్న క్రమంలో నితీష్ కుమార్ సూచనకు ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications