స్టేజిపై ప్రధాని పేరు మర్చిపోయిన సీఎం.. వీడియో వైరల్
బాడీ ప్రెజెంట్.. మైండ్ ఆబ్సెంట్ అంటే ఇదేనేమో.. ఎదురుగా ప్రధాని నరేంద్ర మోదీ కూర్చొన్నా ఆ రాష్ట్ర సీఎం మాత్రం ప్రధాని మోదీ పేరు మర్చిపోయారు. అంతేకాక పాత ప్రధాని పేరును సంబోధిస్తూ స్పీచ్ కంటిన్యూ చేశారు. కొద్ది సేపటికి తేరుకుని.. మాట మార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పదేళ్లుపైగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ పేరును మర్చిపోయారు బిహార్ సీఎం నితీష్ కుమార్. ప్రధాని మోదీ పక్కనే ఉన్నా పేరు మరచిపోయి వేరే నాయకుడి పేరు చెప్పారు. వెంటనే తేరుకుని నితీష్ కుమార్ నవ్వుతూ స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా బిహార్ లో పర్యటించారు. బిహార్ లోని కరకట్ లో దాదాపు రూ. 50 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బిహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా ప్రధాని మోదీ పేరును మర్చిపోయారు. అంతేకాక ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి అని పలికారు. దీంతో సభలోంచి కార్యకర్తలు, అభిమానులు అరుపులు వినిపించాయి.
వెంటనే తేరుకున్న నితీష్ కుమార్ నవ్వుతూ మాట మార్చి ప్రధాని మోదీ అన్నారు. సభలోని ప్రజలంతా లేచి ఆయనకు అభినందనలు తెలియజేయండి అని అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడి తన ప్రసంగాన్ని ముగించారు నితీష్ కుమార్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
बिहार : काराकाट में CM नीतीश कुमार मंच पर भूले PM मोदी का नाम
— News24 (@news24tvchannel) May 30, 2025
◆ वीडियो हुआ SM पर वायरल#PMModiInBihar | #NitishKumar | PM Modi | Bihar News | #BiharThanksModiji pic.twitter.com/K1ibDi6ZDA
బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత త్రివిధ దళాల ధైర్యసాహసాలను ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఈ క్రమంలో పాక్ జరిపిన దాడుల్లో బిహార్ కు చెందిన ఇంతియాజ్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. ఈ మేరకు ఇంతియాజ్ కు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications