నితీష్ ఆహ్వానం.. బీజేపీలో చీలిక!: కమలం పార్టీకి దగ్గరవుతున్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా ఇచ్చిన అధికారిక విందు.. బీజేపీలో చీలికను తెచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ విందుకు కొందరు సీనియర్ నేతలు హాజరు కాగా, మరికొందరు డుమ్మా కొట్టారు.

యోగి ఆదిత్యనాథ్ 'గురుభాయ్' హిందుత్వాన్ని స్వీకరించిన ముస్లీం

బీజేపీతో రెండు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధాన్ని నితీష్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నితీష్ ఇచ్చిన విందుకు బీజేపీ నేతలు హాజరవడం ఇదే తొలిసారి.

Nitish Kumar's Dinner Invite Divides BJP, 'Can't Issue A Whip,' Says A Leader

బీహార్ బీజేపీ ముఖ్య నేత సుశీల్ కుమార్ మోడీతో పాటు పలువురు ఈ విందులో పాల్గొన్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు అయిన ప్రేమ్ కుమార్, నంద కిషోర్ యాదవ్ తదితరులు ఈ విందుకు దూరంగా ఉన్నారు.

నితీషఅ ఆహ్వానం బీజేపీలో చీలిక తెచ్చిందన్న అంశం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఒక విందు కోసం పార్టీ విప్‌ను జారీ చేయలేదు కదా.. ఒక ఆహ్వానాన్ని మన్నించాలా లేదా వద్దా అన్నది వ్యక్తిగత విషయం అని సుశీల్ మోడీ తోసిపుచ్చారు.

అయితే సోమవారం రాత్రి నితీష్ ఇచ్చిన ఈ డిన్నర్ పార్టీకి ఆయన ప్రస్తుత మిత్రపక్షం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రాలేదు. అయినా ప్రజాప్రతినిధి కాకపోవడంతో ఆహ్వానించలేదని సమాచారం. ఆయన తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్‌లు వచ్చారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు పాతిక సంవత్సరాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. నితీష్ సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ పార్టీ కీలకంగా ఉంది. అయితే నితీష్ తీరుపై లాలూ ఇటీవల అసంతృప్తిగాతో ఉన్నారు. నితీష్ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For the first time since Chief Minister Nitish Kumar ended his nearly two-decade-long alliance with the BJP, the party's senior leaders attended an official dinner at his residence in Patna.
Please Wait while comments are loading...