వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: రిజిస్టర్ వ్యాపారులకు ఆభరణాలు విక్రయిస్తే నో జిఎస్‌టి

బంగారు ఆభరణాలను రిజిస్ట్రర్ జ్యూయలర్ వ్యాపారులకు సాధారణ ప్రజలు విక్రయిస్తే ఎలాంటి జిఎస్‌టి పన్ను ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలను రిజిస్ట్రర్ జ్యూయలర్ వ్యాపారులకు సాధారణ ప్రజలు విక్రయిస్తే ఎలాంటి జిఎస్‌టి పన్ను ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

బంగారంపై మూడు శాతం జిఎస్‌టి విధించడంపై జ్యూయలరీ రంగం నుండి ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ విధింపుతో అక్రమ బంగారం విక్రయాలు వెల్లువెత్తాయని వాదనలు విన్పిస్తున్నాయి.

మరోవైపు ఏ బంగారంపై జీఎస్‌టి వర్తిస్తోంది ఏ బంగారంపై వర్తించదో తెలుపుతూ ఆర్థికమంత్రిత్వశాఖ రోజుకో ప్రకటన ఇస్తోంది.

gold jewellery

నిన్ననే పాత జ్యూయల్లరీని అమ్మితే 3 శాతం జిఎస్‌టి వర్తిస్తోందని చెప్పిన ప్రభుత్వం గురువారంనాడు మరో ప్రకటన చేసింది. సాధారణ ప్రజలు బంగారు ఆభరణాలను రిజిస్ట్రర్ జ్యూయల్లర్లకు అమ్మితే మాత్రం ఎలాంటి జిఎస్‌టి ఉండదని స్పష్టం చేసింది.

రిజిస్టర్ జ్యూయల్లర్లకు సాధారణ ప్రజలు బంగారం ఆభరణాలు అమ్మితే 3 శాతం జిఎస్‌టి వర్తించదని ఆర్థికమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

2017 జీసీఎస్‌టి యాక్ట్ సెక్షన్ 9(4) ప్రొవిజన్ల కింద పాత ఆభరణాలను ప్రజలు, జ్యూయలర్లకు అమ్మిన పక్షంలో ఈ పన్ను వర్తింపు ఉండదని చెప్పింది.

అలాంటి కొనుగోళ్ళపై రివర్స్ చార్జీ మెకానిజం కింద జ్యూయలర్లు ఎలాంటి పన్ను చెల్లింపులకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

అదే ఒకవేళ అన్‌రిజిస్ట్రర్ సప్లయర్ బంగారు ఆభరణాలను రిజిస్ట్రర్ సప్లయర్‌కు అమ్మితే ఆర్‌సీఎం కింద పన్ను వర్తిస్తోందని ఆర్థికమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

English summary
Finance Minister Arun Jaitley on Thursday clarified that sale of old jewellery by an individual to a jeweller will not attract the provisions of Section 9(4) of the CGST Act, 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X