వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తుల్లేవ్.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ములాయం..

ఒక్కో సీటు కోసం వందమంది దాకా అభ్యర్థులు పోటీ పడుతున్నారని, కానీ తుది ఎంపికలో తన నిర్ణయమే అంతిమమని ములాయం తెలియజేశారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాది పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. బుధవారం నాడు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఈ జాబితాను ప్రకటించారు.

మొత్తం 403 అసెంబ్లీ నియోజవర్గాలకు గాను 325మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ములాయం.. మిగతా 78స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం సిట్టింగ్ స్థానాల్లో కొనసాగుతున్న 176మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. అయితే సీఎం అఖిలేష్ పేరును మాత్రం జాబితాలో ములాయం పేర్కొనకపోవడం గమనార్హం.

Mulayam

మరోవైపు ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ కు జస్వంత్ నగర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి టికెట్ ఇచ్చినట్టుగా ములాయం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు ఉండబోదని, ఒంటరిగానే బరిలో దిగుతామని ఆయన ప్రకటించారు.

ఒక్కో సీటు కోసం వందమంది దాకా అభ్యర్థులు పోటీ పడుతున్నారని, కానీ తుది ఎంపికలో తన నిర్ణయమే అంతిమమని ములాయం తెలియజేశారు.

English summary
Speaking to the media on Wednesday, Samajwadi Party chief Mulayam Singh Yadav said his party will not form an alliance with any party ahead of UP Assembly polls while announcing a fist list of 295 candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X