భారత్‌లో కరోనా మరణాలపై న్యూయార్క్ టైమ్స్ కథనం: అవాస్తవాలు ప్రచారం చేయొద్దన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మరణాలపై అమెరికాకు చెందిన పత్రిక న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనాన్ని తీవ్రంగా ఖండించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కథనంలో వెల్లడించిన గణాంకాలు వక్రీకరించిన అంచనాలతో కూడినవని, నిరాధార, తప్పుడు రాతలని కేంద్రం స్పష్టం చేసింది.
భారత్‌లో 3.15 లక్షల కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. వాస్తవంగా 42 లక్షల వరకు మరణాలు సంభవించి ఉంటాయని మే 25న న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆస్పత్రులు రోగులతో నిండిపోవడం, ఇళ్లల్లోనే పలు కరోనా మరణాలు చోటు చేసుకోవడంతో మరణాల అధిక సంఖ్యలో ఉండే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో అంచనా వేసింది.

సెకండ్ వేవ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మరణాలు భారీగా నమోదయ్యాయని, వీటిని అధికారిక మరణాల్లో కలపలేదని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్‌లో కరోనా మరణాలపై న్యూయార్క్ టైమ్స్ కథనం నిరాధారమని, తప్పుడు అంచనాలతో కూడినదని తోసిపుచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వక్రీకరించిన అంచనాలతో ఈ నివేదికను వండివార్చారని నీతి ఆయోగ్ సభ్యుడు, భారత కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధిపతి వీకే పాల్ మండిపడ్డారు.
ఇలాంటి తప్పుడు కథనాలు ఎందుకు ప్రచురితం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కాగా, గత కొద్ది వారాలుగా కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దేశంలో తాజాా, 2.11 లక్షల కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 3847 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.73 చేరగా, మరణాల సంఖ్య 3.15 లక్షలకు చేరింది.












Click it and Unblock the Notifications