ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ, వెంటిలేటర్ సపోర్ట్‌పై కొనసాగుతోన్న చికిత్స..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇప్పటికీ ఆయన వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ఇంకా కోమాలోనే ఉన్నారని పేర్కొన్నారు. మెదడులో గడ్డకట్టిన రక్తానికి సంబంధించి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10వ తేదీన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటినుంచి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే అతను కరోనా బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. శస్త్రచికిత్స విజయవంతం అయినా.. ప్రణబ్ మాత్రం కోలుకోవడం లేదు.
ప్రణబ్ ఆరోగ్యం నిన్న స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. కోలుకుంటారని కుటుంబసభ్యులు, అభిమానులు భావించారు. కానీ ఇంతలోనే వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని.. కోమాలోకి వెళ్లిపోయారని వైద్యులు తెలియజేయడంతో ఆందోళన చెందుతున్నారు.

ప్రణబ్ ముఖర్జీ కోమా నుంచి బయటకు వస్తేనే ఆరోగ్య పరిస్థితిపై అంచనా వేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పలువురు ప్రార్థిస్తున్నారు. దేశానికి 2012 నుంచి 2017 వరకు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications