వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NEET: ఎస్సీ,ఎస్టీ,బీసీ ఎన్నారై విద్యార్థులకు నీట్‌లో కుల ఆధారిత రిజర్వేషన్లు వర్తించవా..?

|
Google Oneindia TeluguNews

ఎన్నారై విద్యార్థులకు నీట్‌(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)లో కమ్యూనిటీ రిజర్వేషన్(కుల ఆధారిత రిజర్వేషన్లు) వర్తించదా... వేరే దేశంలో ఉంటున్నంత మాత్రాన వారు తమ రిజర్వేషన్లను కోల్పోతారా... చాలామంది ఎన్నారై విద్యార్థుల్లో ఇప్పుడీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీట్ కోసం దరఖాస్తు చేసుకునే ఎన్నారై విద్యార్థులకు కేటగిరీ ఆప్షన్లలో ఒక్క 'జనరల్' ఆప్షన్ మాత్రమే ఉండటం గమనార్హం.ఎస్సీ,ఎస్టీ,బీసీ కోటా ఆప్షన్లు లేవు. దీంతో కొంతమంది ఎన్నారై విద్యార్థులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

#YSR :మరపురాని మహానేత YSR గారి 12వ వర్థంతి సందర్భంగా ఘననివాళులు, ప్రముఖులతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి (ఫొటోస్)

కేరళ హైకోర్టులో పిటిషన్...

కేరళ హైకోర్టులో పిటిషన్...

కువైట్‌లో నివసిస్తున్న రోహిత్ వినోద్ ఇటీవల నీట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో నేషనాలిటీకి 'ఎన్నారై' ఆప్షన్ ఇచ్చాడు. తర్వాతి పేజీలో కేటగిరీ ఆప్షన్‌ను క్లిక్ చేయగా... అక్కడ 'జనరల్' ఆప్షన్ మాత్రమే కనిపించింది. ఓబీసీ వర్గానికి చెందిన తనకు ఎన్నారై అయిన కారణంగా ఆ రిజర్వేషన్ కేటగిరీ వర్తించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో అతను కేరళ హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేశాడు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా...

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా...


'ఎన్నారైలకు కమ్యూనిటీ రిజర్వేషన్లు ఎందుకు తిరస్కరిస్తున్నారు. మేము భారతీయులం కాదా... రాజ్యాంగబద్దమైన హక్కులు మాకు వర్తించవా... ఎందుకు ఎన్నారైలను విదేశీయుల్లా భావిస్తున్నారు...' అని రోహిత్ వినోద్ తండ్రి కార్తీకేయన్ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోహిత్ వినోద్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు ఆగస్టు 13న విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రోహిత్ పిటిషన్‌పై సానుకూలంగా స్పందిన కోర్టు... నీట్ అప్లికేషన్‌ ఫామ్‌లో మార్పులు చేయాలని సూచించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కి మధ్యంతర ఉత్తర్వులు సూచించింది. అయితే ఇంతవరకూ కోర్టు ఎన్‌టీఏ కోర్టు ఆదేశాలను అమలుచేయలేదని వినోద్ తండ్రి కార్తీకేయన్ వాపోయారు. సెప్టెంబర్ 12న పరీక్ష నీట్ పరీక్ష ఉందని... ఇప్పటికీ అప్లికేషన్ ఫారమ్‌లో మార్పులు చేయలేదని అన్నారు.

ఏదో ఒకటే వర్తిస్తుందా?

ఏదో ఒకటే వర్తిస్తుందా?


వినోద్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన ఎన్‌టీఏ... ఎన్నారై కేటగిరీకి ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక రిజర్వేషన్ ఉందని... అలాంటప్పుడు ఓబీసీ కోటాలో మరో రిజర్వేషన్ వర్తించదని పేర్కొంది. అయితే వినోద్ తండ్రి ఈ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.రాజ్యాంగం ప్రకారం ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,వికలాంగులకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నారై కోటా సీట్లు రిజర్వేషన్ కిందకు రావని అన్నారు. ఈ విషయంపై నేషనల్ మెడికల్ కమిషన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఎన్నారై విద్యార్థులు కుల ఆధారిత రిజర్వేషన్లు పొందేలా అప్లికేషన్ ఫారమ్‌లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. అయితే.. కుల రిజర్వేషన్లు పొందేవారికి ఎన్నారై కోటా వర్తించదని పేర్కొన్నారు.ఆరోగ్యశాఖలో పనిచేసే సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఒక విద్యార్థికి ఒకే కోటా వర్తిస్తుందన్నారు. లేనిపక్షంలో, ఎస్సీ విద్యార్థులు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద దరఖాస్తు చేసుకుంటారు కదా అని ప్రశ్నించారు. ఆ పరిస్థితి రాకూడదన్నారు. ఏదేమైనా ఈ విషయంలో నేషనల్ మెడికల్ ఏజెన్సీ పాలసీని మరింత పటిష్టం చేయాలని అభిప్రాయపడ్డారు.

English summary
Whether community reservation (caste based reservation) is applicable in NEET (National Eligibility cum Entrance Test) for NRI students ... Will they lose their reservation as long as they are in another country ... Many NRI students are still asking these questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X