ఇక దానితో పనిలేదు.. విదేశాలకు వెళ్లే ఇండియన్స్‌కు గుడ్ న్యూస్!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: విదేశీయానాన్ని మరింత సరళీకృతం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇకనుంచి డిపార్చర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకనుంచి డిపార్చర్ కార్డులు నింపాల్సిన పనిలేదని పేర్కొంది.

కాగా, విదేశాలకు వెళ్లాలంటే విధిగా జన్మించిన తేదీ, పాస్ పోర్ట్ నెంబర్, భారత్ లోని చిరునామా, విమాన నెంబర్, బోర్డింగ్ తేదీ వంటి తదితర విషయాలను డిపార్చర్ ఫామ్ లో నింపాల్సి ఉండేది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకనుంచి ఆ అవసరం ఉండదు. ఇతర సంబంధిత ప్రాంతాల్లోను ఇదే సమాచారం అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక దీని అవసరం లేదని తెలిపింది.

Indians flying abroad will not be required to fill departure cards from next month.

అయితే సడలించిన నిబంధనలు కేవలం విమాన ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయి. నౌకాయానం, రైలు మార్గాల ద్వారా విదేశీయానం చేసేవారికి డిపార్చర్ కార్డు తప్పనిసరి. డిపార్చర్ కార్డు తొలగింపుతో విదేశీ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ సమయం తగ్గనుంది. ఇదిలా ఉంటే, గతేడాది డిక్లరేషన్ కార్డు విషయంలోను కస్టమ్స్ డిపార్ట్ మెంట్ కొన్ని సడలింపులు చేసిన సంగతి తెలిసిందే.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు డ్యూటియబుల్ గూడ్స్ ను తీసుకురాకపోతే డిక్లరేషన్ కార్డును నింపాల్సిన అవసరం లేదని కస్టమ్స్ డిపార్ట్ మెంట్ అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indians flying abroad will not be required to fill departure cards from next month.
Please Wait while comments are loading...