Rain alert:వద్దంటే వాన.. తిరోగమనంలోనూ వర్షమే: ఐఎండీ
ఈ సారి ఎండలు ఎక్కువే.. వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. దీంతో జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. అయితే నైరుతి రుతు పవనాల ఆగమనం అయిపోయింది. తిరోగమనం కూడా ఆలస్యం అవుతుంది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయట.. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇవీ పంట ప్రభావం చూపే అవకాశం ఉంది.
దేశంలో జూన్ నెలలో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు అత్యధిక వర్షపాతం కలుగజేస్తాయి. ఇవీ సెప్టెంబరు 17 నుంచి తిరోగమనం ప్రారంభిస్తాయి. దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలు అవుతుంది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే తిరోగమిస్తాయని భారత వాతావరణ విభాగం ఆగస్టు 25వ తేదీన ప్రకటన చేసింది. ఆ ప్రకటనను ఐఎండీ సవరించింది.

నైరుతి రుతుపవనాల ముందస్తు తిరోగమనానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. సెప్టెంబరులో నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రుతుపవన ద్రోణి సెప్టెంబరు 7 నాటికి దక్షిణ దిశగా పయనిస్తుందని, దాంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని మహాపాత్ర వివరించారు.












Click it and Unblock the Notifications