కరోనాకు అంతం అసాధ్యం - కలిసి జీవించాల్సిందే: వ్యాక్సిన్ల సామర్ధ్యం తగ్గుతోంది- ఆంటోనీ ఫౌచీ..!!
కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. అమెరికా కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉంది. ఒక వైపు కరోనా వైరస్.. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ తో కేసుల ఉప్పెనలా వస్తున్నాయి. ఈ సమయంలోనే అమెరికా టాప్ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ను అంతం చేయడం అనేది అభూత కల్పనే అని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్‌కు ఉన్న వ్యాప్తి వేగం కారణంగా అది ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యూటేషన్లు, వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తుల కారణంగా కరోనావైరస్ సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడించారు.
ఈ కేసులతో దేశం దశలోకి అడుగు పెడుతుందని అంచనా వేశారు. కరోనా తట్టుకొనే దిశగా అమెరికా..అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫౌచీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రోజుకు మిలియన్‌కు పైగా కేసులు.. 1,50,000 మందికి ఆసుపత్రుల్లో చికిత్సలు .. 1,200 మంది ప్రాణాలు కోల్పోతుండటం వల్ల.. తాను అంచనా వేసిన స్థితికి అమెరికా ఇంకా చేరుకోలేదన్నారు. కేవలం ప్రారంభం వద్దే ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రారంభ దశలోనూ ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఇక, కరోనా మన జీవితంలో భాగంగా మారిపోతుందని.. మాస్కు వినియోగం అనేది ఖచ్చితంగా మనతో పాటే ఉండాలని ప్రధాని మోదీతో సహా ఏపీ సీఎం జగన్ వంటి వారు పలు సందర్భాల్లో స్పష్టం చేసారు. ఇప్పుడు, తాజాగా థర్డ్ వేవ్ గా చెబుతున్న సమయంలో భారత్ లో ప్రతీ రోజు లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే, గతంలో కంటే మరణాల సంఖ్య తగ్గటం కొంత ఉపశమనం కల్పిస్తోంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావటంతో జనసమూహాలు పెరిగి.. మరింతగా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో.. పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నెల 12న ప్రధాని మోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా కేసుల తీవ్రత పైన సమీక్ష చేయనున్నారు. ఆ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications