ఆంటోని కమిటీ టిపై తగ్గేందుకు కాదు, ముందుకే: డిగ్గీ

న్యూఢిల్లీ: ఆంటోని కమిటీ వేసింది తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో చెప్పారు. ఆ కమిటీని వేసింది కేవలం విభజన తర్వాత వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు మాత్రమేనని చెప్పారు.

విభజన ద్వారా ఏమైనా సమస్యలు వస్తాయో పరిశీలించి వాటిని తీర్చే ఉద్దేశ్యంలో భాగంగానే ఆంటోని కమిటీని వేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు ఎవరు రాజీనామా చేయవద్దని కోరారు.

Digvijay Singh

సిడబ్ల్యుసి నిర్ణయానికి అనుగుణంగానే విభజన జరుగుతుందని చెప్పారు. తెలంగాణపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత ఏకాభిప్రాయంతోనే విభజన నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. సుదీర్ఘ కాలం చర్చలు జరిపామన్నారు.

తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. తెలంగాణ నోట్ కెబినెట్ ముందుకు వెళ్తుందని చెప్పారు. అయితే కేబినెట్ నోట్ ఈ రోజు వస్తుందా రాదా అనే విషయం తనకు తెలియదని చెప్పారు. సీమాంధ్రుల సమస్యలను అందరి సహకారంతో పరిష్కరిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+