ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులే..? సుప్రీంకోర్టు సమర్ధన..!
ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఎంత కష్టపడాలో తెలియంది కాదు. ఓవైపు పెరిగిన పోటీ, మరోవైపు ప్రభుత్వాలు పెడుతున్న సవాలక్ష నిబంధనలు, పెరిగిపోతున్న వయోపరిమితులు.. ఇలా ఎన్నో సమస్యలు. వీటి మధ్యే ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్న నిరుద్యోగులకు తాజాగా ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ముఖ్యంగా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది.

2001లో రాజస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కావాలంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండరాదని నిరుద్యోగులకు నిబంధనలు పెట్టింది. దీన్ని 2017లో పదవీ విరమణ చేసి, 2018లో రాజస్థాన్ పోలీస్‌లో కానిస్టేబుల్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికుడు రామ్ లాల్ జాట్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. రాజస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.
రాజస్తాన్ 2001లో చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారం పిటిషనర్ రామ్ లాల్ 2018లో దరఖాస్తు చేసుకున్న పోలీసు ఉద్యోగానికి అనర్హులయ్యారు. దీనిపై 2022లో రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2002 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ రూపొందించిన నిబంధనల ప్రకారం ఈయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడయ్యాడు. దీంతో రామ్ లాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల విధానాన్ని కలిగి రాష్ట్రాల్లో రాజస్థాన్ తో పాటు అస్సాం, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక కూడా ఉన్నాయి. 2021లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లును కూడా ప్రతిపాదించింది. ఇతర నిబంధనలతోపాటు ఇద్దరు పిల్లల విధానాన్ని ఉల్లంఘించిన వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయకుండా నిషేధించాలని సిఫార్సు చేసింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications