• search

మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యం: పవిత్రం, అపవిత్రం కాదు, కుమారస్వామి కౌంటర్, దేవుడి దయ!

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం అపవిత్రమైనదని కొందరు ఆరోపిస్తున్నారని, ఇక్కడ పవిత్రం, అపవిత్రం అనే ప్రశ్నేలేదని, మెజారిటీ శాసన సభ్యులు ఉంటే ఎవ్వరైనా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగలరని హెచ్.డి. కుమారస్వామి అన్నారు. మెజారిటీ శాసన సభ్యులు లేకపోతే నేనే కాదు ఎవ్వరూ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేరనే విషయం అందరికీ తెలుసని కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చెప్పారు.

  ధర్మస్థలంలో పూజలు

  ధర్మస్థలంలో పూజలు

  మంగళవారం ధర్మస్థలం చేరుకున్న హెచ్.డి. కుమారస్వామి, అనితా కుమారస్వామి దంపతులు శ్రీ మంజునాథ స్వామికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. దైవదర్శనం అనంతరం హెచ్.డి.కుమారస్వామి ఆలయం బయట మీడియాతో మాట్లాడారు.

   కుమార స్వామి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి తెలుగు ముఖ్య‌మంత్రులు
   సీఎం పదవి దైవ నిర్ణయం

   సీఎం పదవి దైవ నిర్ణయం

   సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుల మనసులుమార్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కారణం దైవ నిర్ణయం అని హెచ్.డి. కుమారస్వామి చెప్పారు. మెజారిటీ శాసన సభ్యుల మద్దతు ఉన్నంత వరకు జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలేదని హెచ్.డి.కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకూడదని ఆలయాలు సందర్శించి దేవుడి ఆశీస్సులు, గురువులు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నానని కుమారస్వామి అన్నారు.

   రెండు పార్టీల మేనిఫెస్టోలు

   రెండు పార్టీల మేనిఫెస్టోలు

   శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిందని, జేడీఎస్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, రెండు పార్టీల మేనిఫెస్టోలలోని హామీలు అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కుమారస్వామి అన్నారు. రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం వెయ్యకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.

   వర్షాలు, అధిక లాభాలు

   వర్షాలు, అధిక లాభాలు

   రాష్ట్రంలో కరువు తాండవించకుండా వర్షాలు పడాలని, పంటలు బాగాపండి రైతులకు లాభాలు తీసుకురావాలని దేవుడిని ప్రార్థించానని కుమారస్వామి మీడియాకు చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజల సహకారంతో ఐదు సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు వెలుతామని, ఆదేవుడికి ప్రత్యేక పూజలు చేశామని హెచ్.డి. కుమారస్వామి అన్నారు.

   జీవితాలు నాశనం

   జీవితాలు నాశనం

   పార్టీ మీద, పార్టీ నాయకుల మీద వ్యామోహం ఉండటం తప్పుకాదని, అయితే అది హద్దులు దాటకూడదని కుమారస్వామి అన్నారు. కరావళి (సముద్ర తీరప్రాంతం)లో చిన్నచిన్న విషయాలకు యువకులు రెచ్చిపోవడంతో అల్లర్లు జరిగి అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, యువత ఓపిగా ఉండాలని, లేదంటే మీ కుటుంబంలోనే విషాదం నెలకొంటుందని, శాంతియుతంగా ఉండాలని కుమారస్వామి మనవి చేశారు.

   బీజేపీ జోస్యం కాదు దేవుడి దయ

   బీజేపీ జోస్యం కాదు దేవుడి దయ

   మా సంకీర్ణ ప్రభుత్వం మూడు నెలల్లో కుప్పకూలిపోతుందని బీజేపీ నాయకులు అంటున్నారని కుమారస్వామి గుర్తు చేశారు. భగవంతుడి నిర్ణయాలు ఎవరికి తెలుసు, మనం కోరుకున్నకోరికల తీర్చడంలో ఆదేవుడు అంతిమ నిర్ణయం తీసుకుంటారని. బీజేపీ నాయకులు ఉహలు అలాగే ఉండాలని, వారి మీద తనకు ఎలాంటి కోసం, ద్వేషం లేదని కుమారస్వామి చెప్పారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   JDS leade HD Kumaraswamy said, there is nothing holiness or unholiness in democracy if you have enough MLAs support to form government. He was speaking to media in Dharmasthala after visiting temple.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more