1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత
Recommended Video
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టమైన ప్రకటన చేసింది. జులై 1, 1987కి ముందు భారతదేశంలో జన్మించిన వారు, అలానే వారి తల్లిదండ్రులైనా ఆ తేదీకి ముందు భారతదేశంలో జన్మించి ఉంటే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) 2019 ప్రకారం, జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సీ) వారంతా భారతీయ పౌరులుగా గుర్తింపబడతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అంతేగాక, 2004 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం దేశంలోని ఎవరి తల్లిదండ్రులైనా ఒకరు భారతీయులుగా, మరొకరు శరణార్థులు అయినప్పటికీ వారంతా భారతీయులుగా గుర్తింపబడతారని వెల్లడించింది. అయితే, ఇది అస్సాంలోని వారికి వర్తించదని తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టం 2019పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో కేంద్రం ఈ మేరకు ప్రకటన వెలువరించినట్లు తెలుస్తోంది. కాగా, పౌరసత్వ సవరణ బిల్లు గురించి భారతీయ పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏ ఒక్క భారతీయ పౌరుడికి దీని వల్ల నష్టం ఉండదని హామీ ఇస్తున్నా. కొన్ని స్వార్థపూరిత శక్తులు సమాజంలో విడగొట్టే చర్యలు చేస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. చర్చల ద్వారా సమస్యలపై పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనని, కానీ, ప్రజా ఆస్తికి నష్టం చేయకూడదని అన్నారు.
సమాజంలో అల్లర్లు సృష్టించాలనుకునే స్వార్థపూరిత దుష్ట శక్తులకు తాము అనుమతివ్వబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పస్టం చేశారు. ఇది మనకు శాంతి, సామరస్యం, సోదరభావం చాటాల్సిన కీలక సమయమని అన్నారు. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ హింసకు దూరంగా ఉండాలని కోరారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications