citizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్‌సభ ఆమోదం
Recommended Video
న్యూఢిల్లీ: ముస్లింలపై వివక్ష తమ ఉద్దేశం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా సోమవారం రాత్రి అమిత్ సమాధానమిచ్చారు.

ముస్లింలు మైనార్టీలు కాదు అందుకే..
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో ముస్లింలు మైనార్టీలుగా లేరని అందుకే వారిని.. ఈ సవరణ బిల్లు ద్వారా దేశంలోకి అనుమతించడం లేదని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారతీయులందరికీ రక్షణ ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు ఆ దేశాల్లో ఉండలేని పరిస్థితిల్లోనే మనదేశానికి వస్తున్నారని, అందుకే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు
నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారతీయులందరికీ రక్షణ ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 14కు ఈ బిల్లు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరుపై అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని మత ప్రాదికన విభజించిందని ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ విభజనకు అనుకూలం కాదని అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు వల్ల భారతీయు ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అమిత్ షా స్పష్టం చేశారు.

ఈశాన్య రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. శ్రీలంక తమిళీయులకు పౌరసత్వం ఉందని ఆయన తెలిపారు. బెంగాళీ హిందువులు మన దేశానికి రావడం ఇష్టం లేదా? అంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని పరోక్షంగా ప్రశ్నించారు అమిత్ షా. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇన్నర్ లైన్ ప్రొటెక్ట్ కల్పిస్తామని చెప్పారు. బిల్లు అమల్లోకి తీసుకొచ్చే సమయంలో మణిపూర్ రాష్ట్రాన్ని కూడా ఇన్నర్ లైన్ ప్రొటెక్షన్ కింద చేరుస్తామని చెప్పారు.

రోహింగ్యాలను అనుమతించేది లేదు
అలాగే త్రిపుర, అస్సాం ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లోని ప్రత్యేక తెగలు, సముదాలయాల గురించి కూడా ఆలోచిస్తోందని చెప్పారు. అస్పాం ప్రజల కోసం ఒక ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. దేశంలోకి రోహింగ్యాలను అనుమతించేది లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం
బిల్లుపై 12గంటలపాటు సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ సోమవారం అర్ధరాత్రి ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. బుధవారం రాజ్యసభ ముందుకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు రానుంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications