వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగవాళ్లు జీన్స్, టీషర్ట్ వేసుకోవద్దు -ఆడవాళ్లకు ఏదైనా ఓకే -ఉద్యోగులకు మహా సర్కార్ హుకుం

|
Google Oneindia TeluguNews

ఇండియాలోనే ఓ వైపు మల్టీనేషనల్ కంపెనీలు పొట్టి దుస్తులను కూడా అనుమతిస్తుండగా.. ప్రజలతో నేరుగా మమేకం అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కఠినమైన డ్రెస్ కోడ్ల విధింపు కొనసాగుతున్నాయి. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే సర్కారీ జీవుల వస్త్రధారణపై ఆంక్షలు విధించగా, తాజాగా ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తోన్న రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులు వేటిని ధరించాలో, వేటిని కూడదో పేర్కొంటూ సర్క్యులర్ జారీ చేసింది. ఆ మేరకు..

ఇటు మిస్టరీ -అటు కొత్త రకం వ్యాధి -దేశంలో తొలిసారి -ఆఫ్రికా నుంచి మనకు -ప్రాణాంతకమా?ఇటు మిస్టరీ -అటు కొత్త రకం వ్యాధి -దేశంలో తొలిసారి -ఆఫ్రికా నుంచి మనకు -ప్రాణాంతకమా?

డ్రెస్ ఈజ ద ఇండెక్స్ ఆఫ్ వర్క్

డ్రెస్ ఈజ ద ఇండెక్స్ ఆఫ్ వర్క్


నూతన నిబంధనల ప్రకారం మహారాష్ట్ర సచివాలయం మొదలుకొని గ్రామ పంచాయితీల వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు టీ-షర్టులు, జీన్స్ ధరించడం నిషేధం. విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగుల వస్త్రధారణ ‘‘సరైన'' పద్ధతిలో ఉండాలని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఆదేశించింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల్లోని రెగ్యులర్ ఉద్యోగుల్లో కొందరు, కాంట్రాక్టు సిబ్బందిలో ఎక్కువ మంది అనుచిత దుస్తులు ధరించడాన్ని గుర్తించాం. చక్కటి వస్త్రధారణ ఉద్యోగుల సత్ప్రవర్తన, వ్యక్తిత్వానికి గుర్తుగా నిలుస్తుంది. అనుచిత దుస్తులు ధరించడం వల్ల కార్యాలయాల్లో వాతావరణం దెబ్బతినడమే కాకుండా పనితీరును కూడా పరోక్షంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరంతా ఆరోగ్యకరమైన దుస్తులనే ధరించాల్సి ఉంటుంది''అని మహా సర్కార్ సర్క్యులర్ తెలిపింది. అందులో భాగంగా..

ట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లుట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు

మగాళ్లకు అలా.. ఆడవాళ్లకు ఇలా..

మగాళ్లకు అలా.. ఆడవాళ్లకు ఇలా..


ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తోన్న పురుషులు ఇకపై ఆఫీసులకు జీన్స్, టీషర్టు ధరించడానికి వీల్లేదని, ప్రొఫెషనల్‌ స్థాయిలో తగిన ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించాలని, ఇక కాళ్లకు షూ లేదా శాండిల్స్ మాత్రమే వేసుకోవాలని, స్లిప్పర్స్ అసలే వాడొద్దని సర్కారు ఆదేశించింది. అదే మహిళలకు మాత్రం ఉన్న ఆప్షన్లన్నీ ఇచ్చేయడం గమనార్హం. మహారాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల్లోని రెగ్యులర్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులంతా తమకు ఇష్టమైన రీతిలో చీరలు, సల్వార్లు, ట్రౌజర్స్, టీషర్ట్స్ వేసుకోవచ్చని, మహిళలు స్లిప్పర్స్ కూడా ధరించవచ్చని సర్క్యులర్ లో పేర్కొన్నారు. అయితే కొట్టొచ్చినట్లు కనిపించే రంగులు, వింత ఎంబ్రాయిడరీలు, విపరీతమైన రాతలు రాసుండే టీషర్లులను మాత్రం అవాయిడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

ఇతర రాష్ట్రాల్లోనూ డ్రెస్ కోడ్స్..

ఇతర రాష్ట్రాల్లోనూ డ్రెస్ కోడ్స్..

మహారాష్ట్ర ప్రభుత్వం డ్రెస్ కోడ్ విధించడానికి ముందే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదంటూ ఆదేశాలు వెలువడ్డాయి. కొన్ని చోట్ల స్కర్టులు ధరించరాదని కూడా ప్రభుత్వాలు ఆదేశించాయి. గతేడాది బీహార్‌ ప్రభుత్వం కూడా ఉద్యోగులు క్యాజువల్ దుస్తులు ధరించడాన్ని నిషేధించింది. ‘‘కార్యాలయ సంస్కృతికి, ఆఫీసు మర్యాదకు'' అవి విరుద్ధమంటూ ప్రభుత్వం పేర్కొంది. 2018 జూన్‌లో రాజస్థాన్ ప్రభుత్వం తమ ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించరాదంటూ హుకుం జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఉద్యోగులు తమిళ, భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింభించే దుస్తులే ధరించాలని ఆదేశించింది. 2018లో కర్నాటక ప్రభుత్వం కూడా మహిళా ఉద్యోగులు స్కర్టులు, టీషర్టులు, ప్యాంటు ధరించరాదనీ.. పురుష ఉద్యోగులు టీషర్టులు ధరించకూడదని ఆదేశించింది.

English summary
Jeans and t-shirt may mean stress-free wear for some, but they are no longer suitable 'office attire' for government employees in Maharashtra. And the government may do a policy 'flip-flop' once in a while, but the employees are not allowed to wear the humble slippers to the office as per the new dress code. Also, all government employees must wear khadi clothes at least on Fridays to encourage the use of handspun, a circular issued on December 8 stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X