యూపీలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు; బీజేపీ ప్రజలను విభజించటంతప్ప చేసిందేమీలేదు: సోనియాగాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం ప్రజలను విభజించడం తప్ప ఐదేళ్లలో చేసిందేమీ లేదని ఆరోపించారు . తన నియోజకవర్గం రాయ్‌బరేలీ పై సవతి తల్లి ప్రేమ చూపించిందని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్నికల కోసం తన తొలి ఎన్నికల ప్రసంగంలో, సోనియా గాంధీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల పై విరుచుకుపడ్డారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వారు సమర్థవంతమైన నిర్వహణ చేయలేదని సోనియాగాంధీ ఆరోపించారు.

యూపీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ
ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు కాబోతున్నాయి ఎందుకంటే గత ఐదేళ్లుగా ప్రజలను విభజించడం తప్ప ఏమీ చేయని ప్రభుత్వాన్ని మీరు చూశారు అని సోనియా గాంధీ నాల్గవ దశ ప్రచారం చివరి రోజు వర్చువల్ ప్రసంగంలో అన్నారు.సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ ఫిబ్రవరి 23న మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలైన రాయ్‌బరేలి (సదర్), హర్‌చంద్‌పూర్, బచ్‌రావాన్, సరేని మరియు ఉంచాహర్‌లలో ఓటింగ్ జరుగుతుంది.
మేము మీ కోసం అనేక అభివృద్ధి పథకాలను తీసుకువచ్చాము, కానీ మోడీ-యోగి ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేసిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రజల సేవ చేయడం, ప్రజలకు హక్కులు కల్పించడంపై ఆధారపడిన కాంగ్రెస్ రాజకీయాలను మీరు చూశారని ఆమె అన్నారు.

మీ కోసం రాత్రింబవళ్ళు పని చేసే నాయకులను మీకందిస్తాం.. గెలిపించండి
గత ఐదేళ్లలో యూపీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని, రాష్ట్రంలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న 8 వేల మంది పార్టీ కార్యకర్తలు జైలు పాలయ్యారని ఆమె అన్నారు. ఇదే సమయంలో తాను మీ కుటుంబంలో విడదీయరాని భాగమని భావిస్తున్నానని సోనియా గాంధీ చెప్పారు. మీ జీవితాన్ని మెరుగుపరిచే రాజకీయాలను కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
మీ కోసం రాత్రింబవళ్లు పని చేసే, మీకు అధికారం ఇచ్చే విధానాలను రూపొందించే ఎమ్మెల్యేను మీకు అందించాలనుకుంటున్నాము అని సోనియా గాంధీ అన్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 'హస్తం' (పార్టీ గుర్తు)ను బలోపేతం చేసి, మీ భవిష్యత్తును మెరుగుపరిచే రాజకీయాలను ఎంచుకోండని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. రాయ్‌బరేలీలో మా అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి అని ఆమె విజ్ఞప్తి చేశారు.
కరోనా సమయంలో ప్రజల కష్టాలను గుర్తు చేసిన సోనియా గాంధీ
కోవిడ్ మహమ్మారి పీక్‌లో ఉన్న సమయంలో ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఆక్సిజన్, మందులు మరియు ఆసుపత్రులలో బెడ్లు దొరక్క క్లిష్ట సమయాలను ఎలా ఎదుర్కొన్నారని, చాలా మంది తమ ప్రియమైన వారినికోల్పోయారని ఆమె గుర్తు చేశారు. మరోవైపు, మహమ్మారి చాలా మంది వ్యక్తుల పని మరియు వ్యాపారానికి అంతరాయం కలిగించిందని, లాక్‌డౌన్ సమయంలో చాలా మంది కాలినడకన మైళ్ల దూరం నడవాల్సిన బాధను భరించారని ఆమె పేర్కొన్నారు. మోదీ-యోగి ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా ఉందో ఆ పరిస్థితులు రుజువు చేశాయన్నారు.

రైతుల సమస్యలపై మాట్లాడిన సోనియా గాంధీ
రైతులు, యువత మరియు ద్రవ్యోల్బణం సమస్యలపై కేంద్రంలోని బీజేపీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు సోనియా గాంధీ. పంటలు పండించడానికి రైతులు కష్టపడుతున్నారని, అయితే గత ఐదేళ్లలో వారి ఉత్పత్తులకు సరైన ధర, ఎరువులు లేదా నీటిపారుదల సౌకర్యాలు లభించలేదని ఆమె అన్నారు. రైతులు అప్పుల భారంలో కూరుకుపోయారని, విచ్చలవిడిగా జంతువులు తమ పంటలను నాశనం చేస్తున్నాయని సోనియా గాంధీ అన్నారు.

నిరుద్యోగ సమస్యపై బీజేపీని టార్గెట్ చేసిన సోనియా గాంధీ
కష్టపడి చదివి ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత పరిస్థితి కూడా అలాగే ఉందని, అయితే బీజేపీ ప్రభుత్వం వారిని ఇంట్లో కూర్చోబెట్టిందని ఆమె అన్నారు. రాష్ట్రంలో 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానీ మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు ప్రజలకు భరించలేనివిగా మారాయని మరియు ఇంటిని నడపడం కష్టంగా మారిందని అన్నారు.
నిరుద్యోగ పరిస్థితిపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సోనియా గాంధీ ప్రజల భారాన్ని తగ్గించే బదులు, ప్రభుత్వం అనేక కంపెనీలను తక్కువ ధరలకు స్నేహితులకు విక్రయించిందని, దీని ఫలితంగా నిరుద్యోగం ఏర్పడిందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ "కొత్త విజన్"తో వచ్చిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications