నో మిక్సింగ్-కోవీషీల్డ్ ఎప్పటిలాగే రెండు డోసులు-ప్రోటోకాల్‌లో మార్పుల్లేవ్-వ్యాక్సినేషన్‌పై కేంద్రం క్లారిటీ

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ 'స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్‌'లో ఎటువంటి మార్పులు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలనే కొనసాగిస్తామని తెలిపింది. వ్యాక్సిన్ల మిక్సింగ్‌ ఉండబోదని... అందరికీ కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్‌ రెండు డోసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. వ్యాక్సిన్ల మిక్సింగ్‌కు సంబంధించి... దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయపరంగా తగినన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని పేర్కొంది. కోవీషీల్డ్‌ను కేవలం సింగిల్ డోసు రూపంలో ఇవ్వడం,వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై పరిశోధనలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకె పాల్ దీనిపై స్పష్టతనిచ్చారు.

గందరగోళం వద్దు... అదే షెడ్యూల్

గందరగోళం వద్దు... అదే షెడ్యూల్

'ప్రస్తుతం అనుసరిస్తున్న కోవాగ్జిన్,కోవీషీల్డ్‌ రెండు డోసుల విధానాన్నే కొనసాగిస్తాం. అందులో ఎటువంటి మార్పులు ఉండవు. కోవీషీల్డ్ రెండో డోసును మొదటి డోసు తీసుకున్న 12 వారాల తర్వాత కోవాగ్జిన్ రెండో డోసును మొదటి డోసు తీసుకున్న నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇదే షెడ్యూల్‌ను కొనసాగిస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం. వ్యాక్సిన్ డోసులపై ప్రజల్లో గందరగోళానికి తావు ఇవ్వకూడదు.' అని నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకె పాల్ తెలిపారు.

వ్యాక్సిన్ల మిక్సింగ్... ఇప్పటికైతే ప్రణాళికలేమీ లేవు

వ్యాక్సిన్ల మిక్సింగ్... ఇప్పటికైతే ప్రణాళికలేమీ లేవు

వ్యాక్సిన్ల మిక్సింగ్‌కి సంబంధించి ఇప్పటికైతే ఎటువంటి ప్రణాళికలు లేవని డా.వీకె పాల్ వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు అవసరం అన్నారు. 'రెండు వ్యాక్సిన్లను కలపడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శాస్త్రీయంగా అందుకు అవకాశం ఉండొచ్చు. కానీ అదే సమయంలో దానివల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను కొట్టిపారేయలేం. ఇప్పటికే పలు దేశాలు దీనిపై పరిశోధనలు జరుపుతున్నాయి. ఇప్పటికైతే ఇండియాలో అనుసరిస్తున్న వ్యాక్సిన్ ప్రోటోకాల్‌లో ఎటువంటి మార్పులు ఉండవు.' అని పాల్ స్పష్టం చేశారు.

త్వరలో పరిశోధనలు..?

త్వరలో పరిశోధనలు..?


ఒక వ్యక్తికి మొదటి డోసు కోవాగ్జిన్ ఇస్తే... రెండో డోసు కూడా కోవాగ్జినే ఇవ్వబడుతుందని చెప్పారు. మొదటి డోసులో ఒక వ్యాక్సిన్,రెండో డోసులో మరొక వ్యాక్సిన్ ఉండదని.. ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు ఇస్తారని చెప్పారు. ఇదే అంశంపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ చీఫ్ డా.ఎన్‌కే అరోరా మాట్లాడుతూ... వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై భారత్ తమ పరిశోధనలు ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. వేర్వేరు వ్యాక్సిన్లను కలపడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుందా ఉండదా అన్న అంశాన్ని దీని ద్వారా పరిశీలించవచ్చునని తెలిపారు.

Recommended Video

    TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant
    ఇటీవలి కథనాల నేపథ్యంలో...

    ఇటీవలి కథనాల నేపథ్యంలో...


    వేరువేరు వ్యాక్సిన్ల‌ను మిక్సింగ్ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయా... కోవీషీల్డ్ టీకాల‌ను కేవ‌లం సింగిల్ డోసు రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది... ఈ రెండు అంశాలపై కేంద్రం పరిశోధనలు జరపనున్నట్లు ఇటీవల కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కోవీషీల్డ్ టీకాల‌ను సింగిల్ డోసు రూపంలో ఇవ్వ‌డం వ‌ల్ల దేశ జ‌నాభా మొత్తానికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వ్యాక్సిన్ల మిక్సింగ్ ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే కేంద్రం దీనిపై ఎటువంటి పరిశోధనలు జరపట్లేదు. ప్రజల్లో ఇలాంటి ప్రచారాలు గందరగోళం క్రియేట్ చేసే అవకాశం ఉండటంతో నిపుణుల కమిటీ సభ్యులు దీనిపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+