Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'బ్యాంకు ఖాతాల్లో డబ్బుల్లేవ్ ',' నిజాయితీపరులమని బిజెపి ఒప్పుకొంటోంది'

తమ వద్ద బ్యాంకు బ్యాలెన్స్ లేదని ఆప్ అధినేత , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో పోటీచేసేందుకు తమ వద్ద డబ్బులు లేవని ఆయన చెప్పారు.

గోవా :తమ వద్ద బ్యాంకు బ్యాలెన్స్ లేదని ఆప్ అధినేత , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో పోటీచేసేందుకు తమ వద్ద డబ్బులు లేవని ఆయన చెప్పారు.

పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఫిబ్రవరి నాలుగో తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు తమ వద్ద డబ్బులు లేవని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గోవాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.

డిల్లీ రాష్ట్రంలో రెండేళ్ళకు పైగా అధికారంలో ఉన్నాం. మరో రెండేళ్ళలో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. అయితే తమ వద్ద బ్యాంకు బ్యాలెన్స్ లు లేవని ఆయన చెప్పారు. నిజాయితీ గల పార్టీ తమదని ఆయన చెప్పారు. మిగిలిన పార్టీలన్నీ అవినీతి పార్టీలని ఆయన చెప్పారు.

ఆప్ నేతలు నిజాయితీపరులని బిజెపి నాయకులు తమ అంతర్గత సమావేశాల్లో అంగీకరిస్తున్నారని ఆయన చెప్పారు. గోవాలో బిజెపి, కాంగ్రెస్, ఎంజిపిలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పార్టీలన్నింటికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.

గోవాలో 32 స్థానాలు గెలుస్తాం

గోవాలో 32 స్థానాలు గెలుస్తాం

ఫిబ్రవరి నాలుగవ తేదిన ఎన్నికలు జరిగే పంజాబ్, గోవా రాష్ట్రాలపై ఆప్ దృస్టికేంద్రీకరించింది. ఈ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో సీట్లను సాధించాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. గోవా రాష్ట్రంలో తమ పార్టీ 28 నుండి 32 స్థానాలను కైవసం చేసుకొంటామని ఆప్ అధినేత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.గోవా అసెంబ్లీలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే ఈ అసెంబ్లీలో 28 నుండి 32 స్థానాలు వస్తాయని ఆ పార్టీ అంచనావేస్తోంది.

పంజాబ్ పై 'ఆప్ ' ఆశలు

పంజాబ్ పై 'ఆప్ ' ఆశలు

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలో ఆప్ కు మంచి ఫలితాలు వచ్చాయి. ఈ రాష్ట్రం నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలను ఆప్ కైవసం చేసుకొంది. ఈ విజయం తో పంజాబ్ రాష్ట్రంపై ఆ పార్టీ కేంద్రీకరించి పనిచేస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు మంచి పలితాలు వస్తాయని ఆ పార్టీ అభిప్రాయంతో ఉంది. ఈ మేరకు పంజాబ్ పై ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.అదే సమయంలో గోవా ఎన్నికలపై కూడ కేంద్రీకరించింది.అమృత్ సర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పార్టీ పోటీచేయనుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు అమృత్ సర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడ పోటీచేయనుంది.

ప్రత్యేక మ్యానిఫెస్టోలు ప్రకటించనున్న 'ఆప్ '

ప్రత్యేక మ్యానిఫెస్టోలు ప్రకటించనున్న 'ఆప్ '

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినట్టుగానే గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఆప్ వ్యూహన్ని అనుసరిస్తోంది. డిల్లీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది 'ఆప్ ' . ఇదే తరహ విధానాన్ని ఈ రెండు రాష్ట్రాల్లో కూడ అమలు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాల్లో కూడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక మ్యానిఫెస్టోను ప్రకటించనుంది.

యూపిలో ప్రచారానికి పరిమితం కానున్న 'ఆప్ '

యూపిలో ప్రచారానికి పరిమితం కానున్న 'ఆప్ '

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో 'ఆప్ ' పోటీకి దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది.అయితే ఈ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా మాత్రం విస్తృతంగా ప్రచారం చేయనుంది. బిజెపి చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేసిన నాయకులంతా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా పనిచేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+