ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే గందరగోళం - మొహర్రంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - ఊరేగింపులకు నో

దేశంలో కరోనా వ్యాప్తికి మతాలను ముడిపెడుతూ విద్వేషం వెళ్లగక్కుతోన్న తీరును న్యాయస్థానాలు మరోసారి గర్హించాయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ ముస్లింలను బలిపశులు చేశారంటూ బాంబే హైకోర్టు(ఔరంగాబాద్ బెంచ్) గతవారం ఆగ్రహం వ్యక్తం చేయగా, మొహర్రం పండుగపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ గురువారం సుప్రీంకోర్టు సైతం వర్గాలను టార్గెట్ చేయడంపై అనూహ్య వ్యఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

కొవిడ్ లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో ఈ నెల 30న జరిగే మొహర్రం పండుగకు మినహాయింపు ఇవ్వాలని, ఆ రోజు చేసే ఊరేగింపులకు అనుమతివ్వాలని, ఈ మేరకు దేశమంతటికీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన షియా ముస్లిం లీడర్ సయీద్ కల్బే జవాద్ దాఖలు చేసి పిల్ ను.. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం బెంచ్ గురువారం విచిరించింది.

 No Muharram processions, but general order will be chaos sys Supreme Court

మొహర్రం పండుగ సందర్భంగా ఊరేగింపులకు అనుమతించబోమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. దీనికి సంబంధించి దేశం మొత్తానికి వర్తించేలా సాధారణ ఉత్తర్వులను మాత్రం జారీ చేయబోమని పేర్కొంది. ''మీరు జనరల్ ఆర్డర్ కోసం అడుగుతున్నారు. దాన్నే గనుక మేం అనుమతిస్తే గందరగోళ పరిస్థితి (కేయాస్) ఏర్పడుతుంది. కరోనాను వ్యాపింపజేస్తున్నారంటూ ఒక వర్గం టార్గెట్ గా మారే అవకాశం ఏర్పడుంది. అది మాకు ఇష్టం లేదు. సర్వోన్నత న్యాయస్థానంగా ప్రజల ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టే పని కూడా మేము చేయలేము'' అని చీఫ్ జస్టిస్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

 No Muharram processions, but general order will be chaos sys Supreme Court

పిటిషనర్ సయీద్.. లక్నో ప్రాంతానికి చెందినవాడు కావడంతో ఈ వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూప్రీంకోర్టు సూచించింది. ఆ మేరకు పిటిషనర్ అంగీకరించడంతో కేసును డిస్మిస్ చేశారు. ఇదిలా ఉంటే, పలు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ మొహర్రం ఊరేగింపులకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలుకాగా, దాదాపు అన్నీ కొట్టుడుపోయాయి. హైద‌రాబాద్‌లో మొహ‌ర్రం ఊరేగింపున‌కు తెలంగాణ హైకోర్టు సైతం అనుమతి నిరాకరించింది. ఈ నెల 30న డబీర్‌పురా బీబీకాఆలం నుంచి చాదర్‌ఘాట్‌ వరకు అంబారీ ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్ ను కొట్టేసింది.

Recommended Video

    NEET, JEE Main 2020 : No Postponement, Govt | 7 Non BJP States to Move Supreme Court || Oneindia

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+