కొత్తరకం కరోనా వైరస్ ఆనవాలు భారత్‌లో కనిపించలేదు: ప్రభుత్వం
ఢిల్లీ: యూకేలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్తరకం కరోనావైరస్ ఆనవాలు భారత్‌లో ఇప్పటి వరకు కనిపించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. భారత్‌లో కరోనావైరస్‌కు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిని నీతి ఆయోగ్ సభ్యులు, ప్రభుత్వం కరోనావైరస్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. కొత్త రకం వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పిన ఆయన ఇప్పటి వరకు అయితే అలాంటి ఆనవాలు కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
యువ హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ హాట్ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా గ్యాలరీ
ఇక కొత్త రకం కరోనావైరస్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెప్పిన డాక్టర్ వీకే పాల్... వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని అయితే ఈ వ్యాధి ప్రాణాలు తీసేంత ప్రమాదకారి అయితే కాదని చెప్పారు. కరోనావైరస్ ద్వారా పరివర్తన చెందిన ఈ కొత్త వైరస్ వల్ల ప్రాణహాని ఉండదనే తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్‌లు ఈ వ్యాధికి సరిపోతాయని వీకే పాల్ స్పష్టం చేశారు. ఇక ఈ కొత్త రకం వైరస్ ప్రాణాంతకం కాదని అదే సమయంలో హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా కాదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం చాలా జాగ్రత్తతతో వ్యవహరిస్తోందని చెప్పిన రాజేష్ భూషణ్.. ఇప్పటి వరకు 1000 కరోనావైరస్ పరీక్షలు చేయగా వీటిలో కొత్తరకం వైరస్ ఆనవాలు కనిపించలేదని వివరించారు. అంటే
భారత్‌లో ఇప్పటి వరకు ఈ కొత్తరకం వైరస్ ఎంట్రీ ఇవ్వలేదని స్పష్టమవుతోందని చెప్పారు.

ఇదిలా ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ యూకేకు విమాన సర్వీసులను డిసెంబర్ 31వ తేదీ వరకు రద్దు చేసింది. ఈ కొత్త రకం వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందన్న నివేదిక వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే యూకేకు కెనడా, టర్కీ, బెల్జియం, ఇటలీ, ఇజ్రాయిల్ దేశాలు కూడా తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. యూకేలో వేగంగా విస్తరిస్తుండటంతో ఆదివారం నుంచి కఠినమైన లాక్‌డౌన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక 163 రోజుల తర్వాత తొలిసారిగా భారత్‌లో 3 లక్షల కంటే తొలిసారిగా తక్కువగా యాక్టివ్ కేసులు వచ్చాయని హెల్త్ సెక్రటరీ చెప్పారు. రోజు వారీ కొత్త కేసులు 20000 కంటే తక్కువగా ఉండటం 173 రోజుల తర్వాత నమోదవడం ఇదే తొలిసారని చెప్పారు. ఇప్పటి వరకు 16.3 కోట్లు కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడించారు రాజేష్ భూషణ్. భారత్‌లో కేసులు తగ్గుముఖం పడుతుండగా బ్రెజిల్, యూకే, రష్యా, జర్మనీలాంటి దేశాల్లో క్రమంగా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.