రూ.2 వేల నోటు రద్దుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి, రూ.200 నోట్లు విడుదల నిజమే

రూ. 2వేల నోట్లను రద్దు చేయనున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ స్పందించారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు.

న్యూఢిల్లీ: రూ. 2వేల నోట్లను రద్దు చేయనున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ స్పందించారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు.

కొత్త రూ.2000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించారా? అంటూ విపక్షాలు సైతం బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ప్రశ్నలు సంధించగా.. ఆయన ఆ విషయంపై స్పందించకపోవడం తెలిసిందే.

 No news on Rs 2,000 note 'withdrawal', Rs 200 to be issued soon: MoS Finance Santosh Gangwar

ఈ విషయంపై అరుణ్ జైట్లీ కనీసం క్లారిటీ కూడా ఇవ్వకుండా మౌనం వహించడంతో సమీప భవిష్యత్తులో మరోసారి కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టడానికి సిద్దమవుతోందనే ప్రచారం జరుగుతోంది.

ఈ ఊహాగానాలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ ఫుల్ స్టాప్ పెట్టారు. రూ.2 వేల నోట్లు రద్దవవని, అవి కొనసాగుతాయని ఆయన తెలిపారు. అంతేకాదు, త్వరలోనే రూ.200 నోట్లను కూడా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. అయితే, రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ ఎందుకు నిలిపివేసిందన్న ప్రశ్నపై మాత్రం దానికి సమాధానం రిజర్వ్ బ్యాంక్ చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+