Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: అలాంటివారికి అమిత్ షా హెచ్చరిక

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మూడు రోజుల జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జమ్మూలో ఐఐటీ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన అమిత్ షా.. అక్కడ ఓ మొక్క నాటారు. అనంతరం భగవతి నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు.

కాశ్మీర్​, జమ్మూ ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని .. ఈ అభివృద్ధిలో యువత భాగమవ్వాలని, దీని ద్వారానే ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందన్నారు అమిత్ షా. 2019లో జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అమిత్‌ షా తొలిసారిగా ఇక్కడ పర్యటిస్తున్నారు.

కాశ్మీర్‌లో ప్రారంభమైన అభివృద్ధి శకాన్ని ఎవరూ ఆపలేరన్నారు అమిత్ షా. ఇది దేవాలయాల భూమి అని, శ్యాంప్రసాద్ ముఖర్జీ త్యాగాల భూమి అని వ్యాఖ్యానించారు. స్థానికంగా శాంతి, సామరస్యాలను దెబ్బతీసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అమిత్ షా హెచ్చరించారు.

 No one can stop Jammu and Kashmir development: Amit Shah in visit

ప్ర‌స్తుతం జ‌మ్ముక‌శ్మీర్‌లో అభివృద్ధి ఊపందుకుంద‌ని చెప్పారు. అయితే కొంతమంది ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని.. కానీ ఎవరూ దీన్ని అడ్డుకోలేరని తాను భరోసా ఇస్తున్నానన్నారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్​లో 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా తెలిపారు. 2022 చివరి నాటికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు.

రానున్న రెండేళ్లలో శ్రీనగర్‌లో మెట్రో సేవలు ప్రారంభిస్తామని అమిత్ షా తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత వాల్మీకి సమాజ్, పాకిస్థాన్ శరణార్థుల పట్ల వివక్ష ముగిసిందన్నారు. కాశ్మీర్‌లో కనీస వేతనాల చట్టం అమలవుతోందని అమిత్ షా చెప్పారు.

ప్ర‌స్తుతం జ‌మ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి ఊపందుకుంద‌అన్నారు అమిత్ షా. అయితే కొంతమంది ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని.. కానీ ఎవరూ దీన్ని అడ్డుకోలేరని తాను భరోసా ఇస్తున్నానన్నారు. ఇప్పటికే జమ్మూకాశ్మీర్​లో రూ. 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా తెలిపారు. 2022 చివరి నాటికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు.

ప్రేమ్‌నాథ్ డోగ్రాను దేశ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోర‌న్నారు. శ్యామ‌ప్ర‌సాద్ ముఖ‌ర్జితో క‌లిసి ప్రేమ‌నాథ్ డోగ్రా.. టూ విధాన్‌, టూ నిషాన్‌, టూ ప్ర‌ధాన్ దేశంలో ఎప్ప‌టికీ వ‌ర్క‌వుట్ కావ‌నే నినాదం ఇచ్చారన్నారు. జమ్మూలో ప్రజలు అన్యాయాలకు గురయ్యే రోజులు ముగిశాయని చెప్పేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చానని అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూలోని స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు. ఓ వ్యక్తికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం గమనార్హం. ఏదైనా అవసరం ఉంటే తనకు ఫోన్ చేయాలని హోంమంత్రి అమిత్ షా సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+