నిరాశ చెందలేదు: అద్వానితో భేటీ తర్వాత సుష్మా

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై ఎవరూ అసంతృప్తికి గురి కాలేదని బిజెపి నేత సుష్మా స్వరాజ్ అన్నారు. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంపై గుర్రుగా ఉన్న బిజెపి అగ్రనేత అద్వానీని శాంతపరచడానికి పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, అనంత కుమార్, బల్బీర్ పుంజ్ ప్రయత్నించారు. వారు శనివారం అద్వానీని కలిశారు.

నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అద్వానీ శుక్రవారం బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. రాజ్‌నాథ్ సింగ్ పనితీరుపై ఆయన ఆ లేఖలో ఘాటు విమర్శలు చేశారు.

Sushma Swaraj

అద్వానీ రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖపై చర్చించలేదని సుష్మా స్వరాజ్ చెప్పారు. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మోడీ అద్వానీ నివాసానికి వెళ్లారు. అద్వానీతో ఆయన దాదాపు 30 నిమిషాల పాటు ఉన్నారు.

రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖలో అద్వానీ మోడీ ప్రస్తావన తేలేదు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే అద్వానీ ఆ లేఖ రాసినప్పటికీ మోడీ పేరు ప్రస్తావించకపోవడం విశేషం. మోడీని పార్టీ ప్రధాని అబ్యర్థిగా రాజ్‌నాథ్ సింగ్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానంతరం శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+