‘మహిళా ఫైటర్లు 4ఏళ్లపాటు గర్భం దాల్చకూడదు’
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో మహిళా యుద్ధ పైలెట్లుగా శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు మహిళలు నాలుగేళ్లపాటు మాతృత్వానికి దూరంగా ఉండాలని సంబంధిత అధికారులు అంటున్నారు.

భారత్ తరపున యుద్ధ విమానాలు నడిపే ముగ్గురు మహిళా పైలెట్లు హైదరాబాద్‌లోని ఐఏఎఫ్ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ తీసుకుంటున్న భావనాకాంత్, మోహనాసింగ్, అవని చతుర్వేది అనే ముగ్గురు పైలెట్లు జూన్ 18న పూర్తిస్థాయిలో విధుల్లో చేరతారు.
వీరు అన్ని రంగాల్లో నైపుణ్యం పొందేందుకు మరో నాలుగు సంవత్సరాలు మాతృత్వానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుసేన ముఖ్య అధికారి మార్షల్ బీఎస్ ధనోవా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు.












Click it and Unblock the Notifications