ఇకపై ఈ రైళ్లల్లో నో RAC: లోయర్ బెర్త్ కేటాయింపు ఇలా

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో వసూలు చేసే ఛార్జీలు, టికెటింగ్ నిబంధనలను రైల్వే బోర్డు తాజాగా వెల్లడించింది. సుదూర ప్రయాణాల్లో అందుబాటులో ఉండేలా ధరలు, పారదర్శకత, మెరుగైన ప్రయాణీకుల అనుభవాన్ని అందించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యం. సంప్రదాయ ఛార్జీల విధానాన్ని కొనసాగిస్తూనే అదనంగా మరికొన్ని ప్రయోజనాలను చేకూర్చాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు సంబంధించి స్లీపర్ క్లాస్‌లో RAC (రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్) టిక్కెట్లు రద్దయ్యాయి. ఇందులో ఆర్ఏసీ ఉండదు. సవరించిన నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్‌కు ఆర్ఏసీ బెర్తులు జారీ చేయరు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) మొదలైనప్పటి నుంచే అందుబాటులో ఉన్న అన్ని బెర్త్‌లు ప్రయాణీకులకు కన్ఫర్మ్ అవుతాయి. మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ కోటాలు యథావిధిగా కొనసాగుతాయి గానీ.. స్లీపర్ క్లాస్‌లో అదనపు రిజర్వేషన్ కోటాలు ఉండవు.

No RAC in Sleeper Class as All Berths Confirmed from the Start

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్ల కోసం కనీస ఛార్జీల నిబంధనలను కూడా భారతీయ రైల్వేలు సవరించింది. రైల్వే బోర్డు సూచనల ప్రకారం స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు తమ ప్రయాణ దూరం తక్కువైనా సరే.. కనీసం 200 కిలో మీటర్లకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీకి కనీస ప్రాథమిక ఛార్జీ 200 కిలో మీటర్ల వరకు 149 రూపాయలుగా నిర్ణయించారు. ఈ రైలెక్కిన ప్రయాణికుడు తీసుకోవాల్సిన కనీస ఛార్జీ 149 రూపాయలు.

సెకండ్ క్లాస్ ప్రయాణీకులకు కనీసం 50 కిలో మీటర్ల దూరం ఆధారంగా ఛార్జీ ఉంటుంది. దీనికి ప్రాథమిక ఛార్జీ 36 రూపాయలు. రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్ ఛార్జీ, జీఎస్టీ వంటివి బుకింగ్ సమయంలో అదనంగా చేస్తారు. ఛార్జీ ధరలను క్రమబద్ధీకరించడానికి, రైల్వేలకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడానికి ఉద్దేశించినవి. అదే సమయంలో సాధారణ ప్రయాణీకులకు కూడా అందుబాటులో ఉండేలా ఛార్జీలను నిర్ధారించారు.

ప్రయాణీకులకు ప్రయోజనం చేకూర్చేలా రీఫండ్లను కూడా రైల్వే బోర్డు సులభతరం చేసింది. రిజర్వ్‌ చేసిన టిక్కెట్లు రద్దు అయిన 24 గంటలలోపు రీఫండ్‌లను ప్రారంభించడానికి డిజిటల్ చెల్లింపులకు రైల్వే ప్రాధాన్యత ఇస్తోంది. కౌంటర్ వద్ద ప్రయాణీకులు డిజిటల్‌గా చెల్లించలేకపోతే, సాధారణ రీఫండ్ నిబంధనల ప్రకారం ప్రక్రియ జరుగుతుంది. రిజర్వ్ చేని సెకండ్ క్లాస్ ప్రయాణాలకు పాత నిబంధనలు వర్తిస్తాయి.

లోయర్ బెర్త్ కేటాయింపు విధానాన్ని కూడా అమలు చేసిందీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ లల్లో. వేరుగా బెర్త్ అవసరం లేని పిల్లల, వృద్ధులు, 45 ఏళ్లు పైనున్న మహిళలకు వీలైనంత వరకు ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. నాన్ ప్రీమియం సర్వీసుల్లో కూడా ప్రయాణీకులకు సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోన్నామని రైల్వే స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+