Arvind Kejriwal: కేజ్రివాల్ కు సుప్రీంలోనూ దక్కని ఊరట-ఎన్నికలు మొదలయ్యాకే..!

ఢిల్లీ మద్యం స్కాంలో ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణను ఇప్పటికే రెండు రోజుల పాటు వాయిదా వేసిన కోర్టు.. ఇవాళ మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కేజ్రివాల్ అరెస్టుపై స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 29కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రివాల్ దాఖలు చేసుుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితమే విచారణ చేపట్టింది. అయితే దీన్ని కొనసాగించకుండా ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ కేజ్రివాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏదో ఒకటి తేలుస్తుందని ఆశించిన ఆప్ నేతలకు మరోసారి నిరాశ తప్పలేదు. ఏప్రిల్ 27 లోగా కేజ్రివాల్ అరెస్టుపై స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించిన సుప్రీంకోర్టు.. 29న మరోసారి ఈ కేసును విచారిస్తామని ప్రకటించింది.

no relief to arvind kejriwal in supreme court till april 29

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో కేజ్రివాల్ కనీసం లోక్ సభ ఎన్నికలు మొదలైన పది రోజుల వరకూ జైల్లోనే గడపాల్సిన పరిస్దితి.దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతకు లోక్ సభ ఎన్నికల వేళ సంకట పరిస్ధితి ఎదురవుతోంది. ఢిల్లీ, పంజాబ్ కలిపి 20 లోక్ సభ స్ధానాల్లో ఇండియా కూటమి పోటీ చేస్తుండగా.. ఇందులో కేజ్రివాల్ పార్టీ ఆప్ కూడా పోటీ పడుతోంది. ఇప్పటికే తనను ఎన్నికల ప్రచారానికి అనుమతించాలంటూ కేజ్రివాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే ఏప్రిల్ 23 వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+