Rahul Gandhi : రాహుల్ గాంధీకి మరో షాక్- స్టేకు సూరత్ కోర్టు నో.. మూసుకుపోయిన దారులు ?
మోడీ ఇంటిపేరు ఉన్నవారంతా దొంగలేనంటూ గతంలో 2019 ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ గతంలో గుజరాత్ లోని సూరత్ కోర్టు తీర్పు ప్రకటించింది.దీంతో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష పడటంతో పాటు ఎంపీగా లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్యర్ధనను సైతం సూరత్ కోర్టు కొట్టేసింది.
మోడీ వ్యాఖ్యలపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. వాదోపవాదాల అనంతరం రాహుల్ గాంధీ విజ్ఞప్తిని సూరత్ కోర్టు తోసిపుచ్చింది.
దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం పునరుద్దరణ విషయంలో దారులు మూసుకుపోయినట్లేనని భావిస్తున్నారు. తనను పరువు నష్టం వ్యాఖ్యల కేసులో దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లినందున తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని రాహుల్ సూరత్ కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం అంగీకరించలేదు.

ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు తన పార్లమెంటు సభ్యత్వంపై తీవ్ర ప్రభావం చూపిందన రాహుల్ గాంధీ ఇవాళ సూరత్ కోర్టు దృష్టికి తెచ్చారు. కానీ కోర్టు మాత్రం రాహుల్ వాదనతో ఏకీభవించలేదు. దీంతో ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే లభించలేదు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నప్పటికీ అక్కడ విచారణ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు. ఆలోపు వచ్చే సార్వత్రిక ఎన్నికలు కూడా వస్తాయి.
Surat court dismisses Rahul Gandhi's appeal for stay on conviction in defamation case
— ANI Digital (@ani_digital) April 20, 2023
Read @ANI Story | https://t.co/wQmOw2wcvA#SuratCourt #RahulGandhi #Defamationcase pic.twitter.com/A1LP1maNKN












Click it and Unblock the Notifications