వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి రీఎంట్రీపై తేల్చేసిన రజినీకాంత్: నిన్న చంద్రబాబుతో..ఇవ్వాళ గవర్నర్‌తో భేటీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయాల్లోకి పునఃప్రవేశంపై తన అభిప్రాయం ఏమిటనేది మరోసారి తేల్చి చెప్పారు. క్లారిటీ ఇచ్చారు. ఇవ్వాళ ఆయన చెన్నైలో రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో సమావేశం అయ్యారు. అంతకుముందు రోజే ఆయన దేశ రాజధానికి వెళ్లొచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.

మతం తెలుసుకోవడానికి ఒంటిపై దుస్తులు విప్పించారు.. దారుణంగా కొట్టారు!!మతం తెలుసుకోవడానికి ఒంటిపై దుస్తులు విప్పించారు.. దారుణంగా కొట్టారు!!

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడినీ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరు చర్చించారు. దేశ, రాష్ట్రస్థాయి సమకాలీన రాజకీయాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ముగించుకుని చెన్నైకి వచ్చారు. ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ ఆర్ ఎన్ రవితో సమావేశం అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఆర్ ఎన్ రవి-రజినీకాంత్ భేటీ అయ్యారు.

No to return to politics, Rajinikanth says again after met Governor RN Ravi

అనంతరం రజినీకాంత్ విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌ను కలుసుకోవడానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పారు. మర్యాదపూరకంగా మాత్రమే కలిశానని వివరించారు. గవర్నర్‌తో ఏఏ అంశాల మీద చర్చించారనే విషయాన్ని వెల్లడించడానికి రజినీకాంత్ నిరాకరించారు. చెప్పుకోదగ్గ భేటీ కాదని చెప్పారు. రాజకీయాల్లోకి పునఃప్రవేశించే ఆలోచన కూడా తనకు ఏ మాత్రం లేదని కుండబద్దలు కొట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి రాజకీయాలతో సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

No to return to politics, Rajinikanth says again after met Governor RN Ravi

తరువాత ఏం చేయబోతోన్నారంటూ విలేకరుల ప్రశ్నించగా.. సినిమా షూటింగే కదా కన్నా? అని రజినీకాంత్ నవ్వుతూ బదులిచ్చారు. ప్రస్తుతం రజినీకాంత్.. జైలర్ సినిమాలో నటించాల్సి ఉంది. ఇది త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నెల 15 లేదా 22వ తేదీన షూటింగ్ మొదలవుతుందని రజినీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సే లేదని కొట్టి పడేశారు. తన తరువాతి సినిమా షూటింగ్ కోసం సిద్ధపడుతున్నానని పేర్కొన్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ కింద కళానిథి మారన్ ఈ సినిమాను సమర్పిస్తోన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఆయనే ఈ సినిమాకు కథను సమకూర్చారు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తోన్న మూవీ ఇది. నెల్సన్‌కు ఇది నాలుగో చిత్రం. ఇదివరకు నయనతార నటించిన కొలమావు కోకిల, శివకార్తికేయన్ హీరోగా డాక్టర్, విజయ్ హీరోగా బీస్ట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. బీస్ట్ మినహా మిగిలిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

English summary
South Indian Super star Rajinikanth once again given clarification on his re entry to politics. He says no to return to politics after a question being asked him by the press.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X