వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మార్పీ అంటేనే పన్నులన్నీ కలిపి... మళ్లీ దానిపై వ్యాట్ చట్ట విరుద్ధం: ఎన్ సిడిఆర్ సి

గరిష్ట రిటైల్ ధర(ఎమ్మార్పీ) పై డిస్కౌంట్ ఇచ్చిన సందర్భంలో విడిగా వినియోగదారుల నుంచి వ్యాట్ సహా ఎలాంటి పన్నులు వసూలు చేయరాదని నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (ఎన్ సిడిఆర్ సి) తీర్పునిచ్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గరిష్ట రిటైల్ ధర(ఎమ్మార్పీ) పై డిస్కౌంట్ ఇచ్చిన సందర్భంలో విడిగా వినియోగదారుల నుంచి వ్యాట్ వసూలు చేయరాదని నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (ఎన్ సిడిఆర్ సి) తీర్పునిచ్చింది. వినియోగదారుల చట్టం లోని సెక్షన్ 2(డి) ప్రకారం అన్నిరకాల ట్యాక్స్ లు, సెస్ లు కలిపిన తరువాతే గరిష్ట రిటైల్ ధరను నిర్ణయిస్తారని పేర్కొంది.

ఓ వినియోగదారుడికి, ఉడ్ ల్యాండ్ ఫ్రాంఛైజీ యాజమాన్యానికి నడుమ ఉడ్ ల్యాండ్ జాకెట్ కొనుగోలు విషయంలో ఏర్పడిన వివాదం చివరికి ఎన్ సిడిఆర్ సి వద్దకు చేరగా నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఈ కేసులో ఉడ్ ల్యాండ్ ఫ్రాంఛైజీ యాజమాన్యాన్నే తప్పుబడుతూ ఈ మేరకు తీర్పునిచ్చింది.

న్యూఢిల్లీ, చండీగఢ్ లలో ఉడ్ ల్యాండ్ ఫ్రాంఛైజీలలో రూ.3,995 ఎమ్మార్పీగా ఉన్న జాకెట్ పై ఆ సంస్థ 'ఫ్లాట్ 40 శాతం డిస్కౌంట్' ధరను ప్రకటించింది. తీరా కొన్న తరువాత వ్యాట్ తప్పనిసరి అంటూ మళ్లీ తగ్గింపు ధరకు రూ.119.85 జోడిస్తోంది.

No VAT on items sold at discount: Consumers' body

దీనిపై ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయగా.. జిల్లా, రాష్ట్ర వినియోగదారుల ఫోరంలు వినియోగదారుడికే అనుకూలంగా తీర్పునిచ్చాయి. బాధిత వినియోగదారుడి నుంచి అదనంగా వసూలు చేసిన సొమ్మను తిరిగి ఇవ్వడంతోపాటు నష్టపరిహారం, కోర్టు ఖర్చులు కూడా కలిపి చెల్లించమంటూ ఆదేశించాయి.

అయితే ఈ వివాదంపై సదరు ఉడ్ ల్యాండ్ ఫ్రాంఛైజీ యాజమాన్యం నేషనల్ కన్స్యూమర్ డిస్ ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ కు అప్పీలు చేసుకుంది. అయితే కమిషన్ కూడా జిల్లా, రాష్ట్ర వినియోగదారుల ఫోరంలు ఇచ్చిన తీర్పులనే సమర్థిస్తూ.. ఉడ్ ల్యాండ్ ఫ్రాంఛైజీ యాజమాన్యాన్నే తప్పు పట్టింది.

తీర్పు సందర్భంగా కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ డి.కె.జైన్ మాట్లాడుతూ.. ''ఎమ్మార్పీ అంటేనే అన్ని రకాల పన్నులు కలిపి ఉన్న ధర అని, దానిపై డిస్కౌంట్ ఇస్తూ తిరిగి ఎలాంటి పన్ను వసూలు చేయరాదని, అలా చేయడం వినియోగదారుల చట్టాన్ని ఉల్లంఘించడమే..''అని వ్యాఖ్యానించారు.

నిజానికి ఇప్పటి వరకు ఆన్ లైన్ లో వస్తువులు విక్రయించే అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లు కూడా ఇలా డిస్కౌంట్ ధరలపై మళ్లీ వ్యాట్ తదితర పన్నులు వసూలు చేస్తున్నాయి. ఎన్ సిడిఆర్ సి వెలువరించిన ఈ తీర్పు ఆన్ లైన్ ఈ-కామర్స్ పోర్టల్స్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

English summary
NEW DELHI: The National Consumer Disputes Redressal Commission has held that shops selling goods at 40% discount cannot charge VAT or any other duty on the discounted price. It said that the rebate was on the MRP, which includes all taxes and cess as per Section 2(d) of Consumer Goods Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X