కరోనా వ్యాక్సిన్ పొందాలంటే.. 18-45ఏళ్ల మధ్య వయస్కులకు రిజిస్టర్ తప్పనిసరి, ఎందుకంటే?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మే 1 నుంచి దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయనున్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళితే.. లాభం ఉండదు. మొదట పేరు, వివరాలను రిజిస్ట్రర్ చేసుకోవాలి.
Recommended Video

18-45ఏళ్ల మధ్య వయస్కులు రిజిస్టర్ చేసుకోవాల్సిందే..
18 నుంచి 45ఏళ్ల మధ్య వయస్కులు కరోనా వ్యాక్సిన్ కోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన ఉంది. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు మొదట కోవిన్(CoWIN) పోర్టల్‌లో తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవాలి. ఒక్కసారిగా భారీ సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకునేవారు కేంద్రంలోకి ప్రవేశిస్తే గందరగోళం నెలకొనే అవకాశం ఉండటంతో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి చేశారు.

45ఏళ్లు పైబడినవారైతే.. నేరుగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు
అయితే, 45 ఏళ్లకుపైబడినవారు నేరుగా కరోనా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకునే అవకాశం ఇప్పటికీ ఉందని అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసుల వ్యాప్తి వేగంగా ఉండటంతో మే 1 నుంచి దేశంలో 18ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు
కోవిన్ ప్లాట్ ఫాంతోపాటు ఆరోగ్య సేతు యాప్‌లో కూడా 18-44ఏళ్ల వయస్కులు తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 28 నుంచి ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. డొసు పొందడానికి టీకాలు వేసే ప్రక్రియ, పత్రాలు ఒకే విధంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియతో కరోనా కేంద్రాల వద్ద రద్దీని తగ్గించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని వల్ల ఎలాంటి గందరగోళం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు.

ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఉచితంగానే టీకా..
ప్రైవేటు వ్యాక్సిన్ సెంటర్లు ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసి రూ. 250 డొసు చొప్పున వసూలు చేస్తున్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులు కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి నేరుగా పొంది, వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. అయితే, ప్రవేటు ఆస్పత్రులు కరోనా వ్యాక్సిన్ ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుంటాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడినవారందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తున్నారు. మే 1 నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలనువారు వెంటనే కోవిన్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్‌లలో తమపేరు వివరాలను నమోదు చేసుకుంటే..
ఆ తర్వాత సులభంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.












Click it and Unblock the Notifications