తలుపులు మూసుకంటే మంచిదే: తెరాసపై డిగ్గీ

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి అయినట్లు రాష్ట్ర వ్యవహారాల ఆయన చెప్పారు. మరో రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై శాసనసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తుందని ఆయన ప్రకటించారు. సిపిఐతో పొత్తుపై త్వరలో స్పష్టత ఇస్తామని అన్నారు.
తెరాసతో పొత్తు కోసం కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. విడివిడిగా పోటీ చేస్తే ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెసు నాయకులు వాదిస్తూ వచ్చారు. అయితే, తెరాసలో మాత్రం పొత్తుకు వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది.
ఇదిలావుంటే, హైదరాబాదులోని ఇందిరాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పిసిసి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు శనివారం ఉదయం భేటీ అయ్యారు. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పటైంది. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు, చిరంజీవి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications