జల్లికట్టుపై నేనేమి చెప్పలేను.. ఆర్డినెన్స్ సంగతి తెలియదు: వెంకయ్య
జల్లికట్టును తాను ఓ సాంప్రదాయ క్రీడగానే చూస్తానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: జల్లికట్టును తాను ఓ సాంప్రదాయ క్రీడగానే చూస్తానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. తమిళనాడులో జరిగే ఈ సాంప్రదాయ క్రీడ వల్ల ఎవరికీ సమస్య ఉంటుందని తాను భావించడం లేదన్నారు.
మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో జల్లికట్టు వివాదంపై స్పందించమని కోరగా.. వెంకయ్య నాయుడు అందుకు నిరాకరించారు. అయితే జల్లికట్టుకు అడ్డంకిగా ఉన్న చట్టాన్ని సవరించాలని ఇప్పటికే పలు విజ్ఞప్తులు వస్తున్నట్లు వెంకయ్య చెప్పారు.

ఈ విషయంలో సలహాలు సూచనలు తీసుకుంటున్నామని, దీని గురించి ఇంకా పరిశీలించాల్సి ఉందని వెంకయ్య అన్నారు. కోర్టులు ఏం ఆలోచిస్తున్నాయన్నది కూడా తెలియాల్సి ఉందన్నారు. జనవరి 14లోపు ఏవైనా ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేదా అనే విషయం కూడా తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications