Noida Workers Strike:నోయిడా అల్లర్ల వెనుక పాకిస్తాన్..?
నోయిడాలో గత నాలుగు రోజులుగా పలు ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులు తమ వేతనాలపై పోరాటం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ రోడ్లన్నీ నిరసనకారులతో నిండిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయిన సంగతి తెలిసిందే. కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. క్రమంగా ఇవి అల్లర్లుగా మారాయి. చాలా వాహనాలను నిరసనకారులు తగలబెట్టారు. రాళ్లు రువ్వారు. తమ న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యాలు ప్రభుత్వాలు స్పందించాలని నినదించారు. ఇదంతా ఇలా ఉంటే.. ఈ నిరసనల వెనుక ఓ భారీ కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులోను పాకిస్తాన్ హస్తముందనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది.. పాక్ కుట్ర ఇందులో ఉందా..?
నోయిడా అల్లర్ల వెనుక పాకిస్తాన్
నోయిడాలో కార్మికులు చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వేతనాల్లో పెంపు, పని చేసే వాతావరణం మెరుగుపర్చడం, సంస్కరణల తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పలు ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులు రోడ్డెక్కారు. ఇది కాస్త హింసకు దారితీయడంతో ప్రభుత్వం విచారణ చేస్తోంది.దీని వెనుక పాక్ హస్తం ఉందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమికంగా వాదిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ దీనిపై స్పందించారు.
కొద్ది రోజుల క్రితం నోయిడా, మీరట్‌ల ప్రాంతం నుంచి నలుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నలుగురికి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అస్థిరత, అల్లర్లు చెలరేగేలా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇదంత జరిగిందని చెప్పేందుకు ఈ నలుగురు అరెస్టుతో తేటతెల్లం అవుతోందని అన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకే..
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు పలు అసాంఘిక శక్తులు నిత్యం ప్రయత్నిస్తున్నాయని మంత్రి రాజ్‌భర్ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే కుట్ర కోణంకు తెరతీశాయని మండిపడ్డారు. ప్రజలు ఇలాంటి వారి ట్రాప్‌లో పడుకూడదని ఆయన అర్థించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కొందరు తప్పుడు సమాచారంను ప్రచారం చేస్తున్నారని అన్నారు. అల్లర్లు, హింసతో సమాధానం రాదని.. కార్మికుల ఘోషను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలు జరిపేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం మంత్రి వ్యక్తం చేశారు.
రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి పథంలో ప్రయాణించడం కొందరు ఓర్వలేకున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇది కేవలం పారిశ్రామికాభివృద్ధికి ఆటంకం కలిగించాలనే కొందరి పన్నాగం మాత్రమే అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అల్లర్లను సహించబోమని యోగీ స్పష్టం చేశారు. అల్లర్లకు దిగిన వారి సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పిన యోగీ.. వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.
నోయిడాలో భారీగా పోలీసుల మోహరింపు
ఇదంతా ఇలా ఉంటే సోమవారం సాయంత్రం సమయానికల్లా 300కు పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 100 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.సీసీ ఫుటేజీల ద్వారా నిరసనకారులను గుర్తిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్యాక్టరీల పరిసర ప్రాంతాలపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బయటి వ్యక్తుల ఎంట్రీని గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం నోయిడాలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. పోలీసులను భారీ సంఖ్యలో మోహరించి ఇకపై అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనకారులపై భాష్పవాయువును ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పోలీసు యంత్రాంగం పేర్కొంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..













Click it and Unblock the Notifications