వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్యాకు బిగుస్తున్న ఉచ్చు: నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యాపై ముంబై ప్ర‌త్యేక కోర్టు నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది.

మాల్యా కేసుపై మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద వాద‌న‌లు విన్న ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. కాగా ఈడీ విచారణకు మాల్యా గైర్వాజరైన నేపథ్యంలో విజయ్ మాల్యా పాస్ పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వం గతవారంలో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేయడం ద్వారా ఆయన ఇండియాకు తీసుకురావచ్చని, ఆ తర్వాత ముక్కుపిండి బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.900 కోట్ల ఐడీబీఐ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న మాల్యా ఉద్దేశ పూర్వకంగా రుణాన్ని ఎగ్గొట్టిన కేసుని ఈడీ విచారణ చేస్తోంది.

 Non-Bailable Warrant Issued Against Vijay Mallya By Mumbai Court

ముంబైలోని జోనల్ కార్యాయంలో పీఎంఎల్‌ఐ (అక్రమ ధనార్జనా చట్టం) కింద జరుగుతున్న క్రిమినల్ కేసుల విచారణలో ఏ మాత్రం సహకరించడంలేదని పేర్కొంటూ... మాల్యా డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఇక్కడి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్నీ ఈడీ కోరింది.

రాజ్యసభ సభ్యునిగా జారీ చేసిన డిప్లమేటిక్ పాస్‌పోర్ట్‌ను వినియోగించుకుని ఆయన మార్చి 2న లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. డిప్లమేటిక్ పాస్‌పోర్ట్ రద్దయితే... రెగ్యులర్ పాస్‌పోర్ట్ రద్దుకూ అది దారితీస్తుంది. తాజాగా మాల్యాపై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో మాల్యా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

ఈడీ విజ్ఞప్తి మేరకు కేంద్రం మాల్యా పాస్ పోర్ట్‌ను రద్దు చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ బ్రిటన్ అధికారులకు తెలియజేసింది. తాజాగా విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రపంచంలో మాల్యా ఎక్కడున్నా... పట్టుకోడానికి రెడ్ కార్నర్ నోటీసునూ జారీ చేసే వెసులుబాటు ఏర్పడుతుంది.

అంతేకాకుండా మాల్యాను భారత్‌కు పంపాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని విదేశాంగ శాఖ కోరుతుంది. ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్‌లో ఉన్నారు. మాల్యాకు విదేశాల్లో ఉన్న ఆస్తుల సమాచారాన్ని సేకరించే క్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, తదితర దేశాలకు లెటర్స్ రొగటొరీస్(ఎల్‌ఆర్)ల జారీకి ఈడీ సిద్ధమవుతుంది.

English summary
An arrest warrant has been issued against Vijay Mallya, who has refuted allegations that he siphoned nearly half of a 900-crore loan to his Kingfisher Airlines, to buy property abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X