సూపర్ స్టార్ వ్యాఖ్య.. స్టాలిన్ హ్యాపీ: 'అందుకు సీఎంగా అనర్హుడు'

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తనను స్నేహితుడిగా పేర్కొనడంపై డీఎంకే అధినేత స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు రజనీకాంత్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఊగిసలాడుతోంది. దీనిపై ఇన్నాళ్లుగా రజనీ పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను బట్టి రాజకీయాల్లోకి వస్తున్నారని అర్థమవుతోంది.

Non born tamilian become chief minister: Seeman

ఆయన తమిళుడు కాదన్న వ్యాఖ్యలకు రజనీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తాను పక్క రాష్ట్రంలో పుట్టినా అభిమానులు తనను తమిళుడిని చేశారని చెప్పారు. తమిళనాడుతో 43 ఏళ్ల అనుబంధముందని చెప్పారు. తాను ఇప్పుడు పక్కా తమిళుడ్ని అన్నారు. తమిళనాడును వదిలి వెళ్లేది లేదని చెప్పారు.

మరోవైపు, నామ్ తమిజర్ పార్టీ నాయకుడు సీమన్.. రజనీకాంత్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిలాగే సీమన్ కూడా మాట్లాడారు. రజనీ రాజకీయాల్లోకి పనికి రాడని చెప్పారు. అలాగే తమిళ వాడిగా పుట్టని రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు లేవన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Naam Thamizhar party's Seeman told that politics is not suitable for Rajinikanth and don't like that a non born tamilian become chief minister.
Please Wait while comments are loading...